తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం చాలా రసవత్తంగానే సాగుతోంది. అయితే వైల్డ్ కార్డ్స్ ద్వారా 6 మంది ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆరోగ్యం బాగాలేక ఆయేషా బయటికి వెళ్ళిపోయింది. ఆ మధ్య డెంగ్యూ, టైఫాయిడ్ వంటి కారణం చేత ఆయేషాను బయటకు పంపించారనే విధంగా వినిపించాయి. ఆ తర్వాత వైల్డ్ కార్డు నుంచి ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ రమ్య మోక్ష కూడా హౌస్ లోకి వెళ్లడానికి ముందే ఈమె పైన చాలా నెగెటివిటీ ఏర్పడింది.



కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం పైన భారీ గానే బజ్ క్రియేట్ అయ్యి వెళ్లిన మొదటి రోజే తనూజ, కళ్యాణ్ గురించి మాట్లాడడంతో హౌస్ లో గొడవలు అరుపులతో నానాహంగా చేసింది. ఎంత చేసిన కూడా కేవలం రెండు వారాలకే హౌస్ నుంచి బయటికి వచ్చేసింది రమ్య మోక్ష. మొదటిసారి బిగ్ బాస్ గురించి తన ఇంస్టాగ్రామ్ లో రాసుకుంటూ.. తాను హౌస్ లో ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడ్డానని కానీ అలాంటివేవీ కూడా షోలో చూపించలేదంటూ తెలిపింది.


అలాగే తన ఇంస్టాగ్రామ్ పోస్టులో తన లుక్స్ పైన కామెంట్స్ చేస్తూ మిమ్స్ చేస్తున్న వాటిని మాత్రమే చూశాను కానీ తనకు థైరాయిడ్ ఉంది, హౌస్ లో డైట్ స్కిప్ చేశాను, టాన్సిల్స్ అవ్వడంతో గొంతు కింద చాలా ఉబ్బినట్టుగా మారింది. అలాగే హైదరాబాద్ కి సడన్గా వెళ్లడంతో  అక్కడ నీళ్ల వల్ల కూడ  చాలా ఇబ్బంది పడ్డాను, అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి, చేతులు, మెడ శరీరమంతా కూడా దద్దుర్లు వచ్చాయి. హౌస్ లో ఉండే నీళ్లతో ప్రాబ్లం ఎదురయ్యింది. అలాగే జంక్ ఫుడ్, సోడా తాగడం వల్ల విపరీతమైన జ్వరం హౌస్ లో వచ్చిందని దీనివల్ల డయేరియాతో కూడా బాధపడ్డారని తనకు వచ్చిన ఈ అనారోగ్య సమస్యలను టీవీలో ఎక్కడా చూపించలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందనే విషయంపై త్వరలోనే ఒక వీడియో ద్వారా వివరిస్తానంటూ తెలిపింది రమ్య మోక్ష.

మరింత సమాచారం తెలుసుకోండి: