టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు.  బాలయ్య సినిమాలకు థమన్ వరుసగా పని చేస్తున్న సంగతి తెలిసిందే.  బాలయ్య సినిమాల మ్యూజిక్, బీజీఎమ్ విషయంలో థమన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అఖండ2 సక్సెస్ మీట్ లో థమన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

శివుడు ఇచ్చిన శక్తి వల్లే  అఖండ2 సినిమా కోసం ఎంతో  ఎనర్జీగా పని చేశామని థమన్ అన్నారు.  ఒక్కరోజు కూడా అలసిపోలేదని థమన్ తెలిపారు.  నా మ్యూజిక్ వెనుక  ఎంతోమంది సింగర్స్,  గేయ రచయితలు, సంగీత వాయిద్యకారుల శ్రమ ఉందని థమన్ చెప్పుకొచ్చారు.  సాధారణంగా హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చూస్తామని కానీ బాలయ్య, బోయపాటి కలిస్తే అదో కెమిస్ట్రీ అని థమన్  కామెంట్లు చేశారు.  అది ఫిజిక్స్ రూపంలో తెరపై కనిపిస్తుందని థమన్ పేర్కొన్నారు.

ఈ వారం మూవీ విడుదల ఆలస్యమైందని వాళ్ళు అనుకుని ఉంటే  ముందే కేసు వేయవచ్చని  కానీ  చివరి నిమిషంలో వచ్చి ఆపారని  దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చని  మన మధ్య ఐక్యత లేకుండా పోతుందని థమన్ కామెంట్స్ చేశారు.  చాలామంది వివిధ స్టూడియోలకు వెళ్లి సలహాలు ఇచ్చారని అదేదో ప్రొడక్షన్ హౌస్ కు వెళ్లి ఇచ్చి ఉంటే  బాగుండేదని ఆయన పేర్కొన్నారు.  ఇంతమంది హీరోలు, ఈ స్థాయి అభిమానులు ఎక్కడా లేరని థమన్ తెలిపారు.

మన టాలీవుడ్ ఇండస్ట్రీకి దిష్టి తగిలిందని  సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒకరినొకరు తిట్టుకుంటున్నారని  చాలా నెగిటివిటీ పెరిగిపోయిందని థమన్ చెప్పుకొచ్చారు. ప్రతి సినిమా మన సినిమా అనుకోవాలని ఎవరికైనా దెబ్బ తగిలితే  బ్యాండ్ ఎయిడ్ వేయాలని  బయటకు వెళ్లి బ్యాండ్ వేయకండని థమన్ పేర్కొన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలు విజయం సాధించాలని థమన్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: