అక్కినేని ఇంటిపేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది నాగేశ్వరరావు నాగార్జున మాత్రమే. కానీ ఈ తరం యువతకు గుర్తుకు వచ్చేది మాత్రం నాగచైతన్య  అని చెప్పవచ్చు.. తాత, తండ్రి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో ఎంతో ఎదిగారు నాగచైతన్య.. ఈయన సినిమాల పరంగా ఒడిదుడుకులు పడ్డా కానీ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నారు.. అలాంటి నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకొని తన జీవితంలో కొన్ని చీకటి రోజులను అనుభవించారు. చివరికి ఆమెకు విడాకులు ఇచ్చి దూరమైపోయి సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేశారు.. ఇదే తరుణంలో నాగచైతన్య జీవితంలో ఒక అమ్మాయి ఉండేదని, ఆమెను ఎంతో ఇష్టపడ్డానని చెప్పుకొచ్చారు. ఆమె వల్లే తన జీవితంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా దొరికారని అన్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

నాగచైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  తన లైఫ్ లో  జరిగిన కొన్ని విషయాలను బయట పెట్టారు.. తాను స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను..కానీ అదే అమ్మాయిని మరో ఇద్దరు కూడా ప్రేమించారు.. వాళ్ల పేర్లు గుహ, కృష్ణ. అయితే మేమందరం ఆ అమ్మాయి వెంట ప్రతిరోజు పడి ఓరోజు ప్రపోజ్ కూడా చేశాం. కానీ ఆ అమ్మాయి మా ముగ్గురిలో ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయలేదు. అందరినీ రిజెక్ట్ చేసింది అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు.. అయితే ఈ విషయం ఈ ముగ్గురు ఒక్క దగ్గర కూర్చొని అనుకొని మన ముగ్గురిని రిజెక్ట్ చేసింది అని చాలా సేపు బాధపడి ఒకరినొకరు ఓదార్చుకున్నారట..

అలా ఈ ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడి ఇప్పటికి కూడా అది కొనసాగుతుందని నాగచైతన్య చెప్పుకొచ్చారు.. అంతేకాదు ఆ అమ్మాయి వల్లే నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారని అన్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అమ్మాయి వల్ల ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోవడం చూసాము కానీ కలవడం మాత్రం ఎప్పుడు చూడలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: