రవితేజ, శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం మాస్ జాతర. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కించారు. చిత్రంలో హైపర్ ఆది, హిమజ, రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర తదితర నటీనటులు నటించారు.ఈరోజు భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. మరి ఈ సినిమాతో రవితేజ హిట్ అందుకున్నారా లేదా అనే విషయం చూద్దాం.



స్టోరీ విషయానికి వస్తే:

లక్ష్మణ్ భేరి (రవితేజ) నిజాయితీ గల ఒక రైల్వే పోలీస్ అధికారిగా పనిచేస్తుంటారు. తన ముందు ఎలాంటి అన్యాయం జరిగిన తన పరిధి కాకపోయినా దాన్ని తన పరిధిలోకి తీసుకొని మరి న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా వరంగల్లో పనిచేసే ఒక మంత్రి కొడుక్కి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతారు లక్ష్మణ్ భేరి. ఆ కోపంతో లక్ష్మణ్ భేరి ని కొండల ప్రాంతంలో ఉండే గిరిజన ప్రాంతం అడవివరం రైల్వే స్టేషన్ కు  ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ అక్కడ శివుడు (నవీన్ చంద్ర) ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటారు. చుట్టుప్రక్కల ప్రాంతాలలో శీలావతి రకం గంజాయిని పండిస్తుంటారు. విదేశాలకు స్మగ్లింగ్ చేయడానికి రైల్వే సంస్థను ఉపయోగిస్తారు. మొత్తం రాజకీయ వ్యవస్థ అండగా ఉన్న శివుడికి ఎదురెళ్లి లక్ష్మణ్  ఎలా అడ్డుకున్నాడు ? రైల్వే ఎస్ఐ గంజాయి సామ్రాజ్యాన్ని ఎలా కుల దోశాడు అనేది ఈ సినిమా కథ. ఇందులో తులసి (శ్రీ లీల) హనుమాన్ భేరి (రాజేంద్రప్రసాద్) నటించారు.


ఎలా నటించారంటే:
రవితేజ నుంచి కోరుకొనే ఎంటర్టైన్మెంట్, మాస్ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా రవితేజ నటించిన గత సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. రవితేజ ఫైట్స్, పాటలలో చూపించిన హుషారైన కామెడీ టైమింగ్ అదిరిపోయింది. హీరోయిన్ శ్రీ లీల మూడు కోణాలలో సాగే పాత్రలో ఆకట్టుకుంది. శ్రీ లీల, రవితేజ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ , డాన్స్ హైలెట్ గా ఉన్నాయి. కానీ కథలో ఎలాంటి కొత్తదనం కనిపించకపోవడమే మైనస్ గా మారింది. రవితేజ ఇప్పటికే ఇలాంటి రొమాంటిక్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ చిత్రాలను చేశారని ప్రేక్షకులు చెబుతున్నారు. రవితేజ హైఎనర్జీని  చూపించిన తీరు ఆయన పాత్రను తెరకు పరిచయం చేసిన తీరు కూడా అందరిని ఆకట్టుకుంది. తాతతో ఉన్న అనుబంధాన్ని, వివాహం కాకపోవడానికి గల కారణాలన్నీ కూడా చాలా కామెడీగానే చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో శివుడిగా నవీన్ చంద్ర అద్భుతంగా నటించారు. మొదట్లో విలనిజంతో ఆరంభం చేసినప్పటికీ క్లైమాక్స్ వచ్చేసరికి అది తేలిపోతుంది. హనుమాన్ భేరి పాత్రలో రాజేంద్రప్రసాద్ అలరించారు. బీమ్స్ నేపథ్యం, సంగీతం పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. చివరిగా రవితేజ ను అభిమానులు ఎనర్జిటిక్ గా చూపించడంలో సఫలమయ్యారు.


ప్లస్:
రవితేజ నటన, ఎనర్జీ
యాక్షన్ సన్నివేశాలు
సినిమా మొదటి భాగం

మైనస్:
సినిమాల కొత్తదనం లేని కథ.

రేటింగ్:
2.5/5

మరింత సమాచారం తెలుసుకోండి: