సందీప్ రెడ్డి వంగా తీసింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు తీశారు. అలా అర్జున్ రెడ్డి,కబీర్ సింగ్,అనిమల్ సినిమాలతో సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పేరున్న దర్శకుడిగా క్రేజ్ సంపాదించారు. అంతేకాదు త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. రీసెంట్ గానే ప్రభాస్ బర్త్డే సందర్భంగా స్పిరిట్ మూవీకి సంబంధించి ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఒకే ఒక్క ఆడియోతో ఇండస్ట్రీ షేక్ అయింది. అయితే అలాంటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఎంత బోల్డ్ గా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో బోల్డ్ నెస్ తో పాటు హీరోలు ఆటిట్యూడ్ కూడా చూపిస్తారు. అయితే ఇదంతా సందీప్ రెడ్డి వంగా ఆటిట్యూడ్ అని తెలుస్తుంది. ఆయన  బయట కూడా చాలా ఆటిట్యూడ్ గా ఉంటారట. అందుకే తన ప్రవర్తనని సినిమాల్లో కూడా చూపిస్తారట. 

అయితే అలాంటి సందీప్ రెడ్డి వంగా కి5th క్లాస్ లోనే లవ్ స్టోరీ ఉందట.అవును ఇది రూమర్ కాదు స్వయంగా సందీప్ రెడ్డి వంగా ఒప్పుకున్నది 5th క్లాస్ లోనే ఓ అమ్మాయి చుట్టూ తిరిగి అలాంటి నాటీ పని చేశారట.మరి ఇంతకీ సందీప్ రెడ్డి వంగా లవ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సందీప్ రెడ్డి వంగా తాజాగా తన ఫ్రెండ్ క్రాంతి తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో క్రాంతి సందీప్ రెడ్డి వంగా లవ్ స్టోరీ గురించి చెబుతూ సందీప్ 5th క్లాస్ లోనే ఓ అమ్మాయి వెంటపడేవాడు. అలా అమ్మాయి స్కూల్ అయిపోయాక రిక్షాలో వెళ్తూ ఉంటే సందీప్ అమ్మాయిని సైకిల్ మీద ఫాలో చేసేవాడు.అలా ఓ రోజు నాకు చెప్పకుండానే ఆ అమ్మాయి వెళ్తున్న రిక్షా వెనక సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. కానీ అదే సమయంలో సడన్గా కింద పడిపోయాడు. అయితే సందీప్ కింద పడడం చూసి ఆ అమ్మాయి నవ్వడంతో అది చూసి బాధపడతాడు అనుకున్నాను.

 కానీ సందీప్ మాత్రం తన ఆటిట్యూడ్ చూపించాడు.వెంటనే లేచి అదే అమ్మాయి ముందు సైకిల్ మీద హ్యాండిల్ విడిచిపెట్టి సర్కస్ ఫీట్లు చేస్తూ ఆ అమ్మాయిని మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక సందీప్ వంగా చేసిన సర్కస్ ఫీట్లకు ఆ అమ్మాయి కూడా ఫిదా అయింది. అలా తన ఆటిట్యూడ్ తో అమ్మాయిని పడగొట్టాడు అంటూ క్రాంతి చెప్పుకొచ్చాడు.ఇక క్రాంతి మాటలకు సందీప్ రెడ్డి వంగా కూడా అవునవును ఆ రోజు నిజంగానే అలా జరిగింది అంటూ నవ్వుతూ తన లవ్ స్టోరీని ఒప్పుకున్నాడు.అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు సందీప్ రెడ్డి వంగా 5వ తరగతిలోనే ఆ రేంజ్ లవ్ స్టోరీ నడిపారంటే ఇంకా టీనేజ్ లో ఎన్ని లవ్ స్టోరీలు నడిపాడో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: