ఇక హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో లీడ్ రోల్‌లో లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజును తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆమె చేసిన పాత్రలతో యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న మమిత, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారనుంది. సినిమా స్క్రిప్ట్ పక్కా అయిందని సమాచారం. త్రివిక్రమ్ తనకు తెలిసిన బలమైన ఎమోషనల్ రూట్‌తో, చైతన్యకు ఒక కొత్త డైమెన్షన్ చూపించే విధంగా కథను మలుస్తున్నాడట. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని టాక్. అంతేకాదు వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారట.
ఫ్యాన్స్‌కి అయితే ఈ కాంబినేషన్ విన్నప్పుడే హర్షం ఆపుకోలేని స్థాయిలో ఉంది. ఎందుకంటే చైతన్య యొక్క చార్మ్, త్రివిక్రమ్ యొక్క క్లాస్ టచ్ కలిస్తే — అది డెఫినెట్‌గా ఒక “లవ్లీ సినమాటిక్ ఫీస్ట్” కానుందని వాళ్లు నమ్ముతున్నారు. ఇక షూట్ మొదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు తెలిసిన సమాచారం ఒక్కటే – నాగ చైతన్య – త్రివిక్రమ్ కాంబో నిజంగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ లవ్లీ కాంబినేషన్స్ ఆఫ్ 2026 అంటున్నారు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి