టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వంశీ పైడిపల్లి ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూన్నా సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న ఈయన సినిమాకు మధ్య అత్యంత ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ రావడంతో ఇప్పటివరకు ఈయన చాలా తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆఖరుగా ఈయన తమిళ నటుడు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన వారిసు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల అయ్యి కూడా ఇప్పటికి చాలా కాలమే అవుతుంది. ఈ మూవీ తర్వాత కూడా ఈయన ఇప్పటివరకు తన తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ను ఇవ్వలేకపోయాడు. ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు తక్కువే అయినా అందులో కూడా ఈయన ఎక్కువ శాతం దిల్ రాజు బ్యానర్ లోనే సినిమాలు చేశాడు. ఆఖరుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన వారిసు మూవీ కి కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.

వంశీ పైడిపల్లి తన తదుపరి మూవీ ని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు తాజాగా వంశీ పైడిపల్లి కోసం ఒక అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోని సెట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సల్మాన్ ఖాన్ హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ మూవీ ని సెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వంశీ పైడిపల్లి , సల్మాన్ ఖాన్ కు ఓ కథను వివరించగా అది బాగా నచ్చడంతో ఈయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: