చివరికి మోహన్ బాబు, విష్ణు పైన కూడా మనోజ్ కేసు పెట్టగా ఆ తర్వాత నెమ్మదిగా గొడవలు కూడా సర్దుమునిగినట్లుగా కనిపించాయి. తాజాగా ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ నా కూతురు ఇంతకుముందు విష్ణు వాళ్ల స్కూల్లోనే చదివింది, ఆరు నెలలు వెళ్లిన తర్వాత సడన్గా మానిపించేసాను, కుటుంబంలో గొడవలు జరగడం సర్వసాధారణమే అందరూ కూడా తన కూతురి పైన ఎక్కువగా కేర్ చూపడమే కాకుండా చాలా సేవలు చేసే వారిని అవన్నీ నచ్చకే తన కూతురిని చిన్న స్కూల్ కి పంపించాను అంటూ తెలిపింది.
కుటుంబంలో గొడవల పైన క్లారిటీ ఇస్తూ తాను మనోజ్ మిరాయ్ సినిమా ఈవెంట్ లో మాట్లాడిన దాన్ని కట్ చేసి తప్పుగా ప్రచారం చేశారని , కేవలం విష్ణు గురించి మాట్లాడకపోయినా తిట్టినట్టు కొన్ని థంబ్ నైల్స్ పెట్టి చాలామంది వైరల్ గా చేశారు అంటే తెలిపింది మంచు లక్ష్మి. తన తమ్ముళ్ల మధ్య అగ్గిరాజేసి విడదీయాలని చూసిన వారందరూ కూడా నాశనం అవుతారని తెలియజేసింది. వారి కర్మకి వారి అనుభవిస్తారంటూ మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చివరిగా మంచు లక్ష్మి దక్ష అనే చిత్రంలో నటించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి