యస్ ప్రసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా హీట్ పెంచేస్తుంది. టాలీవుడ్‌లో ఇద్దరు ఎనర్జిటిక్ స్టార్‌లు — జూనియర్ ఎన్టీఆర్, రవితేజ. వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరి నటనకు, ఎనర్జీకి, టైమింగ్‌కి వేరే లెవల్ ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఏమవుతుందో ఊహించండి! అలాంటి కాంబినేషన్‌ను ఒక దశలో నిజం చేయబోయారు. కానీ దురదృష్టవశాత్తూ అది ఆఖరి నిమిషంలో మిస్ అయిపోయింది. ఆ సినిమా పేరు ‘బాద్‌షా’. డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపొందిన ఈ బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఫైనల్ అయ్యాడు. సినిమా స్క్రిప్ట్ ఫైనల్ చేసిన సమయంలో కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్ల కాస్టింగ్‌పై చర్చలు జరిగాయి. వాటిలో ఒక చిన్న కానీ ఇంపార్టెంట్ రోల్ కోసం మొదటగా రవితేజ పేరు పరిశీలించారట.


అప్పట్లో రవితేజ తన కెరీర్ పీక్‌లో ఉన్నాడు — ‘బ్యాక్ టూ బ్యాక్  బిగ్ హిట్ సినిమాలతో బిజీగా ఉన్న టైమ్ అది.  ఎన్టీఆర్, శ్రీను వైట్లలతో స్నేహం కూడా బాగానే ఉంది. అందుకే ఆ చిన్న గెస్ట్ రోల్‌ను రవితేజ చేయాలని టీమ్ అనుకున్నారట. కానీ షెడ్యూల్ క్లాష్‌లు, డేట్ ఇష్యూల కారణంగా రవితేజ ఆ పాత్ర చేయలేకపోయాడు. దాంతో ఆ రోల్ కోసం మరో యంగ్ హీరోను వెతికారు. చివరికి ఆ రోల్ సిద్ధార్థ్‌కు దక్కింది. సినిమాలో కొంచెం సేపు మాత్రమే ఉన్నా, ఆ క్యారెక్టర్ బాద్‌షా కథలో ఒక కీలక మలుపును సెట్ చేస్తుంది. అదే రోల్ రవితేజ చేసి ఉండి ఉంటే, ఆ సీన్ మరింత హైలైట్ అయ్యేదని సినీ వర్గాల్లో అప్పట్లో టాక్ వచ్చింది.



చాలామంది ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ “తారక్–రవితేజ కాంబో ఆ సినిమాలో కుదిరి ఉంటే బాద్‌షా ఇంకో లెవల్‌లో ఉండేది” అని అంటుంటారు. ఇద్దరి ఎనర్జీ, పంచ్ డైలాగులు, కామెడీ టైమింగ్ స్క్రీన్‌పై ఫైర్ వర్క్స్ లా ఎక్స్‌ప్లోడ్ అయ్యేవి.తారక్ తర్వాత రవితేజ, ఇద్దరూ తమ తమ స్టైల్‌లో మాస్ ఎంటర్టైనర్స్‌కు బెస్ట్ హీరోలు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికీ ఒక సినిమా రాలేదు. కానీ ‘బాద్‌షా’ ఆ అవకాశం దగ్గర్లోనే వచ్చి మిస్ కావడం నిజంగా అభిమానుల కోసం ఒక చిన్న నిరాశే. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని ఇప్పుడు కూడా చాలామంది “మిస్ అయిన మాస్టర్‌పీస్ కాంబినేషన్” అంటున్నారు. తారక్–రవితేజ కాంబోలో ఆ సినిమా నిజంగా వచ్చి ఉంటే, అది టాలీవుడ్ హిస్టరీలో మరో బిగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచేది అనడంలో ఎలాంటి సందేహం లేదు! చూడాలి మరీ ఫ్యూచర్ లోనైనా వీళ్ల కాంబోలో ఓ సినిమా అయినా వస్తుంది ఏమో..????

మరింత సమాచారం తెలుసుకోండి: