శిరీష ఏపీ అమ్మాయి. రెంటచింతలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ మాస్టర్స్ పూర్తి చేసుకుంది. కొన్ని రోజులపాటు ఉద్యోగం చేసిన శిరీష ఆ తర్వాత ఇండస్ట్రీ పై ఇష్టంతో ఇండియాకి తిరిగి వచ్చి తన అక్క దగ్గరే ఉంటూ సినిమా ఆడిషన్స్ కు హాజరయ్యేది. అలాంటి సమయంలోనే నారా రోహిత్ నటిస్తున్న ప్రతినిధి 2 సినిమా ఆడిషన్స్ కి హాజరుకాగా హీరోయిన్గా ఎంపిక అయింది. ఇక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు వాటిని పెళ్లి వరకు తీసుకువెళ్లి వివాహం చేసుకున్నారు.
ప్రస్తుతం నారా రోహిత్ వయసు 40 సంవత్సరాలు. శిరీష వయసు 29 సంవత్సరాలు అంటే వీరిద్దరి మధ్య సుమారుగా 11 సంవత్సరాలు గ్యాప్ ఉన్నట్లు వినిపిస్తోంది. నారా రోహిత్ వివాహానికి సంబంధించి అటు ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నారా రోహిత్ కూడా తమ వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పోస్టును షేర్ చేశారు. నారా రోహిత్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది భైరవం, సుందరకాండ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి