తాజా సమాచారం ప్రకారం, ఈ నెల మూడో వారం నుండి యూరప్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడి లొకేషన్లలో షూట్‌కి కావలసిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ చేజ్ సీన్స్‌తో పాటు ఎన్టీఆర్ – రుక్మిణి వసంత్‌ల మధ్య సాగే అద్భుతమైన రొమాంటిక్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే రగిలే యాక్షన్ – కానీ ఈసారి మరింత బోల్డ్ విజువల్ ప్రెజెంటేషన్‌తో వస్తున్నాడట. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ బ్లాక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ హాలీవుడ్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఇప్పుడు ఫ్యాన్స్, ట్రేడ్ సర్కిల్స్ అందరిలోనూ చర్చ జరుగుతున్న ప్రశ్న – “ఎందుకు యూరప్‌లోనే షూట్ చేయాలి?”..సాధారణంగా ప్రశాంత్ నీల్ అవుట్‌డోర్ షూటింగ్స్‌కి అంత ఆసక్తి చూపడు. కానీ ఈసారి మాత్రం కథా అవసరాలు వేరేలా ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా లోని కొన్ని కీలక సీన్స్, అలాగే ఒక ప్రత్యేక సాంగ్ కథలో మేజర్ హైలైట్‌గా నిలిచేలా ప్లాన్ చేశారట. ఆ సాంగ్ విజువల్ ప్రెజెంటేషన్ కోసం ప్రత్యేకమైన యూరోపియన్ లొకేషన్లను సెలెక్ట్ చేశాడట నీల్. అదే కాదు, ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు, టాప్ హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా సైన్ అయ్యారని సమాచారం. అంతా కలిపి, ఈ యూరప్ షెడ్యూల్ సినిమా లుక్‌నే మరో లెవెల్‌కి తీసుకెళ్లబోతోందని చెప్పొచ్చు.
‘డ్రాగన్’ సినిమాను ప్రశాంత్ నీల్ పూర్తిగా మాస్ యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ ప్రెజెంటేషన్ మేళవింపుగా రూపొందిస్తున్నాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఎన్టీఆర్ పవర్, స్క్రీన్ ప్రెజెన్స్, ఇమోషన్ దట్టంగా కనిపించబోతున్నాయని యూనిట్‌లోని సర్కిల్స్ చెబుతున్నాయి.ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్న సెట్ డిజైన్స్, స్టంట్ మాస్టర్స్, లైట్ వర్క్ — అన్నీ హాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్‌కి సాటి స్థాయిలో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఈసారి తన కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్ విజువల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. అన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగితే, ‘డ్రాగన్’ సినిమా 2026 జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి