ఇటీవలే సడన్గా ఒక నగల యాడ్ కు సంబంధించి నటించింది. సిద్ధార్థ ఫైన్ జువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అయితే దీనిపైన నందమూరి అభిమానులు కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. మొదటి యాడ్ లోనే అదరగొట్టేసిన తేజస్విని ప్రశంసలు అందుకుంది. అయితే ఈ యాడ్లో నటించడం వెనక ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నట్టుగా తెలిసింది. ఈ సిద్ధార్థ ఫైన్ జువెలర్స్ పేరుతో నడుపుతోంది ఎవరో కాదు తేజస్వి స్వయాన మరిదేనట.
తేజస్విని భర్త విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్న సంగతి తెలిసిందే.. ఈయన సొంత తమ్ముడిదే సిద్ధార్థ ఫైన్ జువెలర్స్ కావడం చేత తేజస్విని ఈ యాడ్లో నటించింది. అయితే ఈ యాడ్లో తేజస్విని అత్త శ్రీమణి కూడా కనిపించింది. ఈ సందర్భంగా శ్రీమణి మాట్లాడుతూ.. మా కంపెనీకి మా కోడలు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం చాలా ఆనందంగా గర్వంగా ఉందంటూ తెలియజేసింది. తేజస్విని ఎప్పుడూ కూడా బయటికి రాలేదు. అయినా కూడా మొదటిసారి ధైర్యం చేసి బయటికి వచ్చి మరి ఇలా కనిపించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపింది తేజశ్రీ అత్త శ్రీమణి. ఈ యాడ్లో తేజ్ చాలా అద్భుతంగా నటించింది. సింగిల్ టేక్ లోనే అన్ని షాట్స్ ను పూర్తి చేసిందని తెలిపింది. కేవలం ఒక్క రోజులోనే ఈ యాడ్ పూర్తి అయ్యిందంటూ తెలిపింది. అలాంటి కోడలు దొరకడం నా అదృష్టమంటూ తేజస్విని పైన ప్రశంసలు కురిపించింది ఆమె అత్త.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి