సినిమా ఇండస్ట్రీ లో ఓ హీరో , దర్శకుడి కాంబోలో ఒక సినిమా వచ్చి ఆ సినిమా మంచి విజయం సాధించిన మంచి ప్రేక్షకదరణ పొందిన కూడా మరో సారి ఆ కాంబోలో సినిమా వస్తే బాగుండు అని ప్రేక్షకులు అనుకోవడం సర్వసాధారణం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఈయన చాలా సినిమాలలో హీరోగా నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సాయి ధరమ్ తేజ్ , దేవా కట్ట దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయం సాధించకపోయినప్పటికి ఈ మూవీ కి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

అలాగే ఈ సినిమాకు బుల్లి తెరపై , ఓ టీ టీ లో కూడా మంచి ప్రేక్షకాదరణ లభించింది. దానితో చాలా మంది సాయి ధరమ్ తేజ్ , దేవా కట్ట కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే మరోసారి ఈ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితమే దేవా కట్ట , సాయి ధరమ్ తేజ్ కి ఓ కథను వినిపించగా అది బాగా నచ్చడంతో సాయి ధరమ్ తేజ్ కూడా దేవా కట్ట దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ (SYG) సంబరాల ఏటి గట్టు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sdt