టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు. ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కేవలం యాంకర్ గానే కాకుండా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తోంది. షోలు యాడ్స్ రకరకాల పనులు చేస్తూ ప్రస్తుతం బిజీ నటిగా మారిపోయింది. అలాంటి విష్ణు ప్రియ ఒకానొక సమయంలో తన అమ్మను బ్రతికించుకోవడం కోసం చాలా కష్టపడిందట. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లి హాస్పిటల్ బిల్లు కట్టడం కోసం ఆయన చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చింది.. ఆయన ఎవరో ఆ వివరాలు చూద్దాం.. విష్ణు ప్రియ తల్లి 42 సంవత్సరాలకే మరణించింది. దీనికి ప్రధాన కారణం ఆమె  సరైన సమయానికి మందులు వేసుకోకపోవడం.. సరైన సమయానికి చికిత్స అందకపోవడం అని చెప్పుకొచ్చింది. 

మా అమ్మ ఆరోగ్యం క్షీణించే అంతవరకు హాస్పటల్ కి వెళ్లలేదు.. కానీ చివరికి నా బలవంతం మీదే హాస్పటల్లో జాయిన్ చేశా. డాక్టర్లు మూడు రోజుల్లో చనిపోతుందని చెప్పారు. కానీ మా అమ్మ సంవత్సరం బ్రతికింది. ఇదే సమయంలో హాస్పటల్లో బిల్లు మాత్రం లక్షల్లో అయింది.. నా దగ్గర ఉన్నదంతా హాస్పిటల్ బిల్లు పే చేస్తాను. ఇంకా కట్టాల్సి ఉంది.. నాకు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదు.. కానీ నాకు ఇండస్ట్రీలో చాలా దగ్గర ఉన్న వ్యక్తుల్లో వేణు స్వామి ఒకరు.. వెంటనే ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను.. నాకు కావలసినంత డబ్బును ఆయన పంపించి మా అమ్మను కాపాడారు..

అయితే వేణు స్వామి గురించి కొంతమంది చెడుగా మాట్లాడుతారు. కానీ ఆయన చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. ఆయన అంత మంచి సాయం అందించిన మా అమ్మ సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకలేదు.. ఆమె మరణం తర్వాత నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని, దేవుడు నన్ను తీసుకెళ్లి మా అమ్మను ఉంచి ఉంటే బాగుండని చాలాసార్లు కోరుకున్నానని ఎమోషనల్ అయింది. మీది ఏమైనప్పటికీ విష్ణు ప్రియ ఈ విషయాన్ని బయటికి చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. చాలామంది విష్ణు ప్రియ అభిమానులు అధైర్య పడొద్దు ధైర్యంగా బ్రతకాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: