టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసిన (శ్రేష్ఠ వర్మ) ను లైంగిక వేధింపులు చేశారని పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం సంచలనంగా మారింది. జైలుకు వెళ్లి బెయిల్ బయటికి వచ్చారు జానీ మాస్టర్. అలా బయటికి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో మళ్లీ సినిమాలలో బిజీగా కనిపిస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాలను కొరియోగ్రాఫర్ గా అవకాశాలు అందుకోవడమే కాకుండా తెలుగు, తమిళ్ ,కన్నడ వంటి భాషలలో కూడా కనిపిస్తున్నారు. ముఖ్యంగా లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత జానీ మాస్టర్ కు ఇలా వరుస అవకాశాలు ఇవ్వడం పైన పలు రకాల భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఈ విషయం పైన తప్పుపడుతున్నారు.



అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ధైర్యంగా తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది ప్రముఖ సింగర్ చిన్మయి. జానీ మాస్టర్ పైన గతంలో కూడా సంచలన ఆరోపణలు చేసింది సింగర్ చిన్మయి. ఇప్పుడు మరొకసారి అతని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ వంటి వారికి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలిపినట్టుగా అవుతుందంటూ వెల్లడించింది. అధికారం, ప్రభావం, డబ్బు దుర్వినియోగం చేసేటువంటి వారి చేతులలో పెట్టవద్దు మనం నమ్మే కర్మ సిద్ధాంతమే నిజమైతే అది తప్పకుండా వదిలిపెట్టదు అంటూ సింగర్ చిన్మయి ట్వీట్ చేసింది..



ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం పైన కొంతమంది సింగర్ చిన్మయికి మద్దతు తెలుపుతూ ఉండగా, మరి కొంతమంది జానీ మాస్టర్ పైన వచ్చిన ఆరోపణలకు ఇంకా ఎలాంటి రుజువు లేదు కదా అంటూ సింగర్ చిన్మయిని విమర్శిస్తున్నారు. మరి ఈ విషయం పైన ఎవరు ఏ విధంగా స్పందిస్తారనే విషయం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: