దర్శకుడు సుబ్బారెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ కొత్త చిత్రానికి “వారణాసి” అనే పేరు ఫిక్స్ చేయబడిందని సమాచారం. ఈ టైటిల్ లో సనాతన ధర్మం, ఆధ్యాత్మికత, పవిత్ర నగరం వారాణసి కి సంబంధించిన ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో, రాజమౌళి–మహేష్ బాబు సినిమా కోసం పరిశీలనలో ఉన్న టైటిల్ ఇదే కావడంతో, అభిమానులు మరియు నెటిజన్లలో గందరగోళం నెలకొంది.ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో కూడా ఇలాంటి పరిణామం ఒకసారి చోటుచేసుకుంది. 2010లో మహేష్ బాబు నటించిన “ఖలేజా” సినిమా సమయంలో కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో “ఖలేజా” అనే టైటిల్‌ను ఇతర నిర్మాతలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవడంతో, చిత్ర బృందం చివరికి సినిమాకు “మహేష్ ఖలేజా” అనే పేరు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాంటి టైటిల్ కాంపిటిషన్ రావడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కొంతమంది నెటిజన్లు దీనిని యాదృచ్చికం కాదని, కావాలని చేసిన పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. మహేష్ బాబు, రాజమౌళి సినిమా అప్‌డేట్స్ ప్రారంభం కావడానికి ముందు ఈ టైటిల్‌తో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ కావడం వెనుక వ్యూహం ఉందని కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం యాదృచ్చికం మాత్రమేనని భావిస్తున్నారు.ఏది ఏమైనా, “వారణాసి” అనే టైటిల్ చుట్టూ నెలకొన్న ఈ చర్చ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ సినిమా ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్‌గా రూపొందుతుందనడంలో సందేహం లేదు. అందువల్ల, ఈ టైటిల్ చుట్టూ ఉన్న వివాదం లేదా చర్చ ఎంతవరకు నిజమవుతుందో, చివరికి రాజమౌళి ఏ పేరు ఫైనల్ చేస్తారో అన్నది ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి