పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ — ఈ పేరు వినగానే ఇప్పుడు మొత్తం దేశం ఒక్కసారిగా రెస్పాండ్‌ అవుతుంది. ఒకప్పుడు “బాహుబలి” సినిమాతో దేశం మొత్తం సిల్వర్‌ స్క్రీన్‌ మీద మాయ చేసిన ప్రభాస్‌, ఇప్పుడు మాత్రం గ్లోబల్‌ లెవెల్‌లో కూడా తన క్రేజ్‌ను చూపిస్తున్నాడు. సౌత్‌లో ఇప్పటికే భారీ మార్కెట్‌ కలిగిన ప్రభాస్‌కి, నార్త్‌ బెల్ట్‌లో కూడా మాస్‌ ఫాలోయింగ్‌ అంతకంతకు పెరుగుతోంది. ఇప్పుడు ఆయన ప్రతి సినిమా పాన్‌ ఇండియా మాత్రమే కాకుండా, పాన్‌ వరల్డ్‌ అటెన్షన్‌ పొందుతోంది.అయితే ప్రభాస్‌ ఇంతగా ఎదగడం బాలీవుడ్‌లోని కొంతమందికి నచ్చడం లేదు అనేది సినిమా వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌ అన్నది ఎవరికైనా రావచ్చు, కానీ దాన్ని కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. కానీ ప్రభాస్‌ మాత్రం అలా కాదు — అతను కేవలం స్టార్‌ కాదు, ఓ ఫెనామినన్‌గా మారిపోయాడు.


ఇటీవల ‘స్పిరిట్‌’ అనే సినిమాలో ప్రభాస్‌ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌లో “ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌” అని ప్రభాస్‌ను వర్ణించడం బాలీవుడ్‌ వర్గాల్లో ఒక్కసారిగా బలమైన చర్చకు దారితీసింది. కొంతమంది అక్కడి ఫిల్మ్‌మేకర్స్‌, అభిమానులు, సోషల్‌ మీడియాలోని గ్రూపులు దీనిపై రియాక్ట్‌ అవుతూ, "బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌ అనేది షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ లేదా ఆమిర్‌ ఖాన్‌" అని కౌంటర్స్‌ వేయడం మొదలుపెట్టారు.దీంతో ఈ ట్యాగ్‌ చుట్టూ నిజంగా కోల్డ్‌ వార్‌ మొదలైందని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ‘పథాన్‌’, ‘జవాన్‌’ వంటి సినిమాలతో భారీ విజయాలు సాధించిన దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తాజాగా షారుఖ్‌ పేరుని హైలైట్‌ చేస్తూ కొన్ని కామెంట్స్‌ చేయడం, నెట్‌ వర్గాల్లో ఇది ప్రభాస్‌ మీద పరోక్ష కౌంటర్‌గా భావిస్తున్నారు.



అసలు ప్రభాస్‌ మీద ఈ ఈర్ష్య ఎందుకు అంటే, ప్రస్తుతం ఆయన ఒకే టైంలో పలు భారీ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నాడు. ‘కల్కి 2’ లాంటి సైన్స్‌ ఫిక్షన్‌ ఎపిక్‌, ‘రాజసాబ్" వంటి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ తో పాటు, ‘స్పిరిట్‌’ వంటి హై వోల్టేజ్‌ డ్రామా వరకు, ప్రతి జానర్‌లో ప్రభాస్‌ సత్తా చాటుతున్నాడు. ప్రతి సినిమా కూడా బడ్జెట్‌, స్కేల్‌, బిజినెస్‌ పరంగా బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ను మించిపోతోంది.ఇక ఆయన సినిమాల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చూడగానే కూడా ఇండస్ట్రీ షాక్‌ అవుతోంది. డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ — ఇవన్నీ కలిపి ప్రభాస్‌ సినిమాలు బాక్సాఫీస్‌కి ముందే వందల కోట్ల రెవెన్యూ తెచ్చేస్తున్నాయి. ఇదే కారణంగా బాలీవుడ్‌ సర్కిల్స్‌లో కొంత అసూయ, కొంత ఆందోళన కూడా కనిపిస్తోంది. మొత్తం మీద ప్రభాస్‌ స్టార్‌డమ్‌ ఇప్పుడు కేవలం సౌత్‌ లోగాక, బాలీవుడ్‌ లో కూడా హీట్‌ క్రియేట్‌ చేస్తోంది. ఆయన పేరు చుట్టూ ఈ స్థాయి హంగామా అంటే, నిజంగానే బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ ఆయనకు సరిగ్గా సరిపోతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ కోల్డ్‌ వార్‌ ఎక్కడ ఆగుతుంది? మరి ఈ స్టార్‌డమ్‌ రేస్‌లో చివరగా ఎవరు గెలుస్తారు? అనేది ఇప్పుడు అందరి ఆసక్తి కేంద్రంగా మారింది. కొంత మంది నిజాయితి గల ప్రభాస్ తో పెట్టుకుంటే వాళ్ల బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిన్నట్లే అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: