టాలీవుడ్లో సింగర్ గా పేరు సంపాదించిన దేవిశ్రీప్రసాద్ గురించి, ఆయన పాటల పాపులారిటీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ 46 ఏళ్ళైనా ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. అయితే గతంలో ఒక హీరోయిన్ తో మాత్రం లవ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అవి రూమర్ గానే మిగిలిపోయాయి. గత కొద్దిరోజులుగా హీరోగా ట్రై చేస్తున్నారనే విధంగా దేవిశ్రీప్రసాద్ వార్తల పై తాజాగా జగపతిబాబు హొస్టుగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే షోలో అతిథిగా వచ్చారు దేవిశ్రీప్రసాద్. ఇందులో జగపతిబాబు అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానాలను తెలిపారు దేవిశ్రీప్రసాద్.


జగపతిబాబు ఇలా ప్రశ్నిస్తూ నీ ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో ఎవరు అంటూ అడగగా?.. అందుకు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. చిరంజీవి గారంటూ తెలిపారు. తాను మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కలలు కన్నప్పటి నుంచి తన పాటకు చిరంజీవి డాన్స్ వేస్తారని ఎదురు చూశాను. ఇప్పటికీ తన పాటకు చిరంజీవి గారు డాన్స్ వేస్తే చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను ఆయన ఎనర్జీ మరో స్థాయిలో ఉంటుందని తెలిపారు.


ఇక మరొక ప్రశ్న ఇండస్ట్రీకి వచ్చాక మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా అంటూ అడగగా?. అందుకు దేవిశ్రీ ప్రసాద్ తాను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఇళయరాజా గారినే దేవుడిగా భావించాను ఆయనను ఒక్కసారైనా చూడాలనుకున్నాను అలాంటిది ఆయన గత ఏడాది నా స్టూడియోకి వచ్చారని ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.


మీ విషయాలను పంచుకొని వ్యక్తి ఎవరు అంటూ ప్రశ్నించగా?. అందుకు సుకుమార్ గారే అంటూ సమాధానం చెప్పారు దేవిశ్రీప్రసాద్. నాకు సోదరుడితో సమాధానం అంటూ తెలిపారు.

ఫస్ట్ హీరో అవుతావా? పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రశ్నించగా? దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటావా అనే ఆప్షన్ పక్కన ఎలాంటి ఆప్షన్ పెట్టిన ముందు దాన్నే అంగీకరిస్తాను! అందుకే మీ ప్రశ్నకు సమాధానంగా ముందు హీరో అవుతానని,ప్రస్తుతం చాలానే స్క్రిప్టులు వస్తున్నాయి ఏదైనా కథ నచ్చితే కచ్చితంగా ఓకే చెబుతానట్టు తెలిపారు దేవిశ్రీప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: