సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం ఇందులో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం కూడా కష్టమే. ఒకటి రెండు చిత్రాలతో పాపులారిటీ సంపాదించుకున్న చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ఆ తర్వాత అవకాశాలు లేక చాలామంది ఇండస్ట్రీని వదిలేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో కమెడియన్ గా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ బబ్లూ కూడా ఒకరు. ఈ కమెడియన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే అనుకోకుండా ఇండస్ట్రీని వదిలేసి డీజేగా పనిచేస్తున్నారు.


డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రం సినిమా ద్వారా కమెడియన్ గా పేరు సంపాదించిన బబ్లూ అల్లు అర్జున్ తో కలిసి ఆర్య సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత ఆనందం, చిరుత, ఎవడి గోల వాడిది తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.ఇండస్ట్రీలోకి  కమెడియన్స్ ఎక్కువమంది రావడంతో ఆ సమయంలోనే అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. అలాంటి సమయంలోనే తన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వరుసగా మరణిస్తూ ఉండడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఇంట్లో ఉండడం వల్ల తాను నటనకు దూరమయ్యానంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు బబ్లూ.


తనకి మంచి అవకాశాలు వస్తే ఇప్పుడు కూడా నటించడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదట. దీంతో తాను డీజేగా పని చేస్తున్నానని తెలియజేశారు. బబ్లూ కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. 2006 నుంచి తాను డీజేగా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఒకప్పుడు కమెడియన్ గా అలరించిన బబ్లూ ఇప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా డీజేగా పనిచేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేవలం నటన మీదే కాకుండా ఎలాగైనా సంపాదించుకోవచ్చు అనే విధంగా కమెడియన్ బబ్లూ చేసి చూపిస్తున్నారని కొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: