టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రమ్యకృష్ణ గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ తన అందంతో యంగ్ హీరోయిన్లకు దీటుగా కనిపిస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్న రమ్యకృష్ణ తాజాగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఒక చిత్రంలో ఈమె నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పోలీస్ స్టేషన్ అనే రియలిస్టిక్ దెయ్యం కాన్సెప్ట్ కథాంశం అన్నట్లుగా వినిపిస్తోంది. పూర్తి హర్రర్ సినిమా కాకపోయినా మైండ్ గేమ్ ఉన్న థ్రిల్ మూవీగా ఉండబోతుందట.


అయితే రమ్యకృష్ణ కి సంబంధించి తాజా లుక్ ను డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. రమ్యకృష్ణ ఇందులో భయంకరంగా కనిపించడమే కాకుండా చాలా హాట్ గా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా రమ్యకృష్ణ తిలకం పెట్టుకొని ,కళ్ళకు కాటుకతో మాంత్రికురాలిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఏంటో మళ్లీ గుర్తుకు తెచ్చే లుక్ లో రమ్యకృష్ణ కనిపిస్తోంది. రమ్యకృష్ణ కూడా ఈమధ్య ఎక్కువగా పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించడానికే మక్కువ చూపుతోంది..


కానీ ఈసారి వర్మ రమ్యకృష్ణ లోని కొత్త యాంగిల్ ని బయటకు తీసుకువస్తున్నట్టుగా కనిపిస్తోంది. మనోజ్ బాజ్ పాయ్ పోలీస్ ఆఫీసర్గా, జెనీలియా సపోర్టింగ్ పాత్రలో నటిస్తున్నారు. ఒక దెయ్యం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఒక్కొక్కరిని వేటాడడం అనే కాన్సెప్ట్ తో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. వర్మ ఈ ఫోటోలకు ట్యాగ్ లైన్ షేర్ చేస్తూ చనిపోయిన వారిని మీరు అరెస్టు చేయలేరు అంటూ రమ్యకృష్ణ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం రమ్యకృష్ణ లుక్ సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు షేక్ చేస్తున్నాయి. మరి ఏ మేరకు సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: