టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరి మధ్య రిలేషన్ గురించి చాలాకాలంగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ జంట చాలా కాలంగా ఒకరినొకరు డేటింగ్ చేస్తున్నారని, వారి మధ్య బంధం చాలా లోతుగా ఉందని అభిమానులు మాత్రమే కాదు, కొన్ని మీడియా వర్గాలు కూడా రకరకాల రూమర్స్‌ను వ్యాప్తి చేశాయి. ఇటీవల అయితే వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని, త్వరలోనే తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.వీరిద్దరూ ఈ రూమర్లపై ఎప్పుడూ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం కూడా ఆసక్తికర అంశం. ఎన్ని గాసిప్స్ వచ్చినా, ఎన్ని ఊహాగానాలు వినిపించినా, విజయ్ మరియు రష్మిక ఇద్దరూ వాటిని పెద్దగా పట్టించుకోరు. తమ కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టి, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు. సినీ ప్రాజెక్టుల షూటింగ్స్, ప్రమోషన్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు — ఇలా ప్రతి విషయంలోనూ వీరిద్దరూ తమ పనికి నిబద్ధత చూపుతున్నారు.


ప్రస్తుతం రష్మిక మందన్న తన కొత్త చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్” ప్రమోషన్లలో బిజీగా ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాలో రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తోంది. సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రష్మిక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ, ఈవెంట్లలో పాల్గొంటూ కనిపిస్తోంది. అయితే ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఈవెంట్లలో మాట్లాడే తీరు, యాస, స్లాంగ్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే రష్మిక మాట్లాడే విధానం, హావభావాలు, మాటలలోని స్టైల్ — ఇవన్నీ విజయ్ దేవరకొండను బాగా తలపిస్తున్నాయి. తెలుగులో మాట్లాడే సమయంలో ఆమె వాడే తెలంగాణ యాస, భాషలోని ఉత్సాహం, కొన్ని సరదా వ్యాఖ్యలు, చిలిపి ఎక్స్‌ప్రెషన్లు అన్నీ విజయ్ స్టైల్‌ను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రష్మిక విజయ్ వాడే స్లాంగ్, ఫన్నీ లైన్స్, సిగ్నేచర్ ఎమోషన్స్‌ను కూడా అనుకరిస్తోందని అభిమానులు గమనిస్తున్నారు.



దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు "రష్మిక విజయ్‌ను ఫాలో అవుతోంది, ఆయన స్టైల్‌ని కాపీ చేస్తోంది" అంటుండగా, ఇంకొందరు "విజయ్ ఏం మంత్రం చెప్పాడో… రష్మిక పూర్తిగా ఆయన మాయలో పడిపోయింది!" అంటూ సరదాగా స్పందిస్తున్నారు. మరికొందరు “ఇద్దరి కెమిస్ట్రీ అసలు తెరమీద మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లో కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది” ..పతియే ప్రత్యేక్ష దైవం"..అప్పుడే కాబోయే భర్త అడుగుజాడల్లో నడుస్తుంది  అంటూ చమత్కారంగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: