టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు చాలా సమస్యలు వస్తున్నాయి. ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా రాజా సాబ్ సంక్రాంతికి వస్తుందని ముందు నుంచి ప్రచారం చేశారు. ప్రభాస్ సినిమాలకు ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది అన్ని భాషలలో సరైన విడుదల తేదీ ఎంచుకోవాలి. రెండోది టైటిల్ యూనివర్సిటీ కావాలి. రిలీజ్ ముందు అటు నార్త్ లో భారీ పబ్లిసిటీ చేయాలి. రిలీజ్ కు ఆరు నెలల ముందు నుంచి ఏదో ఒక ప్రమోషనల్ కంటెంట్ ఇస్తూ ఉండాలి. సోషల్ మీడియాను హోరెత్తించాలి.. అప్పుడు కానీ సరైన ఓపెనింగ్స్ రావు. ఇక రాజాసాబ్ సినిమాకు ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా ఉంది. ప్రభాస్ సినిమాకు హిందీ బెల్టు లో ప్రచారం కీలకం.
హిందీలో ఈ సినిమాను రవి నటన భర్త అనిల్ తడానీ యే పంపిణీ చేస్తున్నారు. నిర్మాత హీరో ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రచారం చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు పాట వస్తుంది అంటూ సోషల్ మీడియా లో హడావుడి చేస్తున్న పట్టించుకోవడం లేదు. పైగా సంక్రాంతి సినిమా కావడంతో పోటీ ఎక్కువ ఉంది. అటు చిరంజీవి సినిమా వస్తోంది. పైగా రిలీజ్ కు టైం రెండు నెలలు మాత్రమే ఉంది. ఇప్పటి నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేయాలి. మారుతి ఇంకా అవి ఏమి పట్టనట్టు ఉన్నారు. ఇటు హీరో , నిర్మాత , దర్శకుల మధ్య చర్చలు పిఆర్ టీం సూచనలు ఇవన్నీ కలిసి రాజాసాబ్ ప్రచారాన్ని ముందుకు తీసుకు వెళ్ళటం లేదు .. సరి కదా మరింతగా డిలీట్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్న చాలామందికి అసలు సంక్రాంతి సినిమా వస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి