మహా కుంభమేళలో పూసలమ్ముతూ బారి పాపులారిటీ సంపాదించుకున్న మోనాలిసా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజీతోనే ఏకంగా హీరోయిన్గా కూడా పలు సినిమాలలో నటిస్తోంది. మోనాలిసా తన అందమైన కళ్ల తో అందరిని ఆకట్టుకుంది. ఆమె కళ్ల ద్వారానే సోషల్ మీడియాలో కూడా ఓవర్ నైట్ కి స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. అలా మోనాలిసా కుటుంబం, ఇల్లుకు సంబంధించిన విషయాలు కూడా వైరల్ గా మారాయి. దీంతో బాలీవుడ్ లో నిర్మాత ,దర్శకురు ఒకరు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి మరి అడ్వాన్స్ ఇచ్చి హీరోయిన్గా తన చిత్రంలో ఆమెను ఎంపిక చేసుకున్నారు దీంతో ఒక్కసారిగా ఈమె తలరాతే మారిపోయింది.


అయితే ఆ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల పట్టాలెక్కలేదు. అంతేకాకుండా ఆమె యాక్టింగ్ ట్రైనింగ్ లో కూడా ఉన్నట్లు కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి.  ఆ తర్వాత షాపింగ్ మాల్స్ లాంటివి ఓపెనింగ్ చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇటువంటి తరుణంలో ఏకంగా పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు సిద్ధమైనట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోనాలిసాకు సంబంధించి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ,తమిళం వంటి భాషలలో ఏకకాలంలో ఈ  చిత్రానికి సంబంధించి సంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది.


గతంలో క్రష్, ఇట్స్ ఓకే గురువు వంటి చిత్రాలలో హీరోగా నటించినటువంటి చరణ్ సాయి హీరోగా మరొకసారి కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంగమాంబ మూవీస్ బ్యానర్ పైన తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ శ్రీను కోటపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం కూడా కొద్దిసేపట్లో హైదరాబాదులో జరగబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా చిత్ర బృందం అన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరి ఈ సినిమాతో ఏ విధంగా పాపులారిటీ సంపాదించుకుంటుందో చూడాలి మోనాలిసా.

మరింత సమాచారం తెలుసుకోండి: