యస్ ప్రసెంట్ ఇప్పుడు అందరు ఇలానే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ నెల మధ్యలో జరగబోయే మహేష్ బాబు–ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లోని సెన్సేషనల్ గ్లోబల్ ప్రాజెక్ట్ లాంచ్ ఈవెంట్ కోసం అభిమానులు, సినీప్రియులు మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.ఇప్పటికే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో లాంచ్ ప్లాన్ అవ్వడం ఇదే మొదటిసారి. ఈవెంట్‌ను ఎక్కడో ఒక సింపుల్ ఫంక్షన్‌లా కాకుండా, గ్రాండ్ సెలబ్రేషన్‌లా  ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాక, ఈ లాంచ్ ఈవెంట్‌ను దేశంలోనే అత్యంత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని రాజమౌళి బృందం నిర్ణయించిందట.


ఇంతకు ముందు ఎప్పుడూ ఓటీటీ ద్వారా లైవ్ ఈవెంట్ ప్రదర్శన జరగలేదు, కాబట్టి ఇది ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందని ఇండస్ట్రీ టాక్.మరి ఈ సెన్సేషన్ వెనుక ఉన్న ఖర్చు విషయానికి వస్తే — లేటెస్ట్ బజ్ ప్రకారం కేవలం ఈ ఒక్క ఈవెంట్ కోసమే దాదాపు 15 కోట్ల రూపాయలకుపైగా వ్యయం చేస్తున్నారని తెలుస్తోంది! ఇది ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడూ జరగని విషయం. ఇంతవరకు ఏ సినిమా లాంచ్ ఈవెంట్‌కి కూడా ఇంత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టిన రికార్డు లేదు. ఇది చూస్తేనే రాజమౌళి–మహేష్ కాంబినేషన్ ప్రాజెక్ట్ ఎంత ఎక్స్‌ట్రా ఆర్డినరీ స్కేల్‌లో రూపుదిద్దుకుంటుందో అర్థమవుతుంది. రాజమౌళి స్థాయికి తగిన విధంగా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కబోతోందని అందరూ భావిస్తున్నారు.



అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ వైరల్ అవుతూనే ఉంది. ఈవెంట్ పోస్టర్స్, టీజర్స్, లీక్ అయిన వివరాలు—ఇవన్నీ నిమిషాల్లోనే ట్రెండ్ అవుతున్నాయి.“ఆరంభమే ఇంత గ్రాండ్‌గా ఉంటే, ఇక సినిమా రిలీజ్ వరకు ఎలాంటి సర్ప్రైజ్‌లు ఎదుర్కోబోతున్నామో ఊహించలేము” అంటున్నారు సినీ విశ్లేషకులు.సింపుల్‌గా చెప్పాలంటే, ఈ నవంబర్‌తోనే టాలీవుడ్‌లో కొత్త ఎరా మొదలుకాబోతోంది — సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు జక్కన్న రాజమౌళి జంటగా తెరపై మంత్రం చేయబోతున్నారనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: