మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి భారీ అపజయాలను అందుకుంటున్న విషయం మన అందరికి తెలిసిందే. రవితేజ కొంత కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఆపజయాన్ని అందుకుంది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.26 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 8 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది. 

రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటించాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది. అలాగే ఈ సినిమాకు ప్రస్తుతం పెద్ద ఎత్తున కలెక్షన్లు కూడా దక్కడం లేదు. దానితో ఈ మూవీ మిస్టర్ బచ్చన్ సినిమా స్థాయి కలెక్షన్లను అయిన వసూలు చేస్తుందా ..? లేదా అని కొంత మంది అనుకున్నారు. 

కానీ మాస్ జాతర మూవీ ఇప్పటికే మిస్టర్ బచ్చన్ సినిమా లైఫ్  టైమ్ కలెక్షన్లను దాటి వేసింది. అసలు విషయం లోకి వెళితే ... మాస్ జాతర మూవీ కి మిస్టర్ బచ్చన్ మూవీ తో పోలిస్తే బెటర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి ఇప్పటివరకు 9.50 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటికే మిస్టర్ బచ్చన్ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటివేసింది. దానితో ఈ మూవీ మరికొన్ని రోజుల్లో మరి కొంత కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది. దానితో ఈ మూవీ మిస్టర్ బచ్చన్ మూవీ తో పోలిస్తే చాలా బెటర్ సినిమాగా నిలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt