నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్” విడుదల సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.  విజయ్ తన సోషల్ మీడియా  హ్యాండిల్ ద్వారా ఈ చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ఆ పోస్టులో ఆయన చెప్పిన మాటలు అభిమానుల హృదయాలను తాకుతున్నాయి. విజయ్ దేవరకొండ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు —“నాకు తెలుసు, వాళ్లు ఎంతో శక్తివంతమైన, భావోద్వేగపూరితమైన, మనసును కదిలించే సినిమా చేశారు. ఆ కథలోని నిజాయితీ, ఆ పాత్రల లోతు, నటుల ప్రదర్శనలు అన్ని అత్యున్నత స్థాయిలో ఉంటాయి. నమ్మడానికి కష్టంగా అనిపించినా, ఇది నిజమే .. ఈ సినిమా ఆడియన్స్ మనసుల్లో ముద్ర వేసేలా ఉంటుందని నాకెంతో నమ్మకం ఉంది. మనందరం థియేటర్‌కి వెళ్లి ‘ది గర్ల్ ఫ్రెండ్’ని చూస్తూ, ఆ అనుభూతిని పంచుకుందాం.” అని విజయ్ రాసుకొచ్చారు.


ఆ పోస్ట్ వైరల్ అవ్వగానే, నెటిజన్లు మరియు అభిమానులు ఇద్దరూ ఉత్సాహంగా స్పందిస్తున్నారు. కొందరు “విజయ్ ఇలా పర్సనల్‌గా రష్మిక మూవీని ప్రమోట్ చేయడం అంటే దాంట్లో ఏదో ప్రత్యేకం ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక రష్మిక కూడా వెంటనే ఆ పోస్ట్‌కి ఎమోషనల్‌గా రిప్లై ఇచ్చింది. ఆమె షేర్ చేసిన పోస్ట్ మరింత చర్చకు దారితీసింది.“అవును విజయ్… ఇది నిజంగా శక్తివంతమైన కథ, హృదయాన్ని తాకే ప్రయాణం. నమ్మడానికి కష్టం అయినప్పటికీ, ఇదే నిజం. మీరు చెప్పిన ప్రతి మాటలో నిజమైన ప్రోత్సాహం ఉంది. ఈ సినిమా చాలా కాలం పాటు ప్రజల మదిలో నిలుస్తుంది. ఇకపై ఈ ప్రయాణంలో మీరు భాగమవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను చూసిన తర్వాత మీరు నన్ను గర్వంగా చూసేలా ఉంటుంది.” అని రష్మిక స్పందించింది.



ఈ మధురమైన సోషల్ మీడియా సంభాషణ చూసిన అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. విజయ్–రష్మికల మధ్య ఇంత సన్నిహితమైన బంధం  చూసి చాలామంది “ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో “#VijayRashmika” హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే —“విజయ్ దేవరకొండ చెప్పినట్లుగానే… నమ్మడానికి కష్టంగా ఉన్నా, అదే నిజం బ్రో!”..!!



మరింత సమాచారం తెలుసుకోండి: