అప్పుడప్పుడు అనుకోకుండా మూడో వ్యక్తి వచ్చి చేరుతారు. అయితే కొంతమంది అనుకోకుండా వారిని గొడవల్లోకి లాగుతారో లేక కావాలనే గొడవల్లోకి లాగుతారో ఏం కారణమో తెలియదు కానీ తాజాగా చిరంజీవి పరిస్థితి కూడా అలాగే అయింది.. ఇక విషయం ఏమిటంటే.. టీవీ5 మూర్తికి నటుడు ధర్మ మహేష్ కి మధ్య కొద్ది  రోజుల నుండి ఒక గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గానే ధర్మా మహేష్ టీవీ ఫైవ్ మూర్తి పై తన భార్య గౌతమి పై లీగల్ గా వెళ్లి కోర్టు లో కేస్ కూడా వేశారు. పోలీసులు ఆ ఇద్దరిపై కేసు కూడా నమోదు చేశారు.తనని టీవీ ఫైవ్ మూర్తి 10 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని, లేకపోతే నా ప్రైవేట్ వీడియోలు,సంభాషణలు బయట పెడతానని బెదిరిస్తున్నాడని కూడా ఆ పిటిషన్ లో తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా టీవీ 5మూర్తి చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై మెగా ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా మండిపడుతున్నారు.

 ధర్మ మహేష్ నా భార్యకి టీవీ5 మూర్తికి మధ్య ఏమో సంబంధాలు ఉన్నాయి అంటూ కొన్ని ఫోటోలు చూపించారు. ఇక ఈ ఫోటోలపై స్పందించిన టీవీ5 మూర్తి గౌతమి పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు నన్ను ఆహ్వానిస్తేనే నేను మా ఇంటికి వెళ్లాను. అలా అక్కడ సలాడ్ తిన్నాను. నేను ఏమీ పర్సనల్ గా వెళ్లలేదు. వాళ్ల ఫ్యామిలీ ఆహ్వానిస్తేనే వెళ్లాను. కేవలం సలాడ్ తిన్నందుకే నాపై లేనిపోని ఆరోపణలు సృష్టించాలా అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు ఆ మధ్యకాలంలో జగన్ ఆహ్వానం మేరకు చిరంజీవి ఆయన ఇంటికి భోజనానికి వెళ్లారు. ఆ సమయంలో చిరంజీవి భోజనం చేసి ఆయన కంచం ఏమైనా పట్టుకొని పోయారా అంటూ ఉదాహరణగా చిరంజీవిని తీసుకొని చెప్పారు.

అయితే మీకు గొడవలు ఉంటే మధ్యలోకి మా హీరోని ఎందుకు లాగుతారు అంటూ కొంతమంది మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.అంతేకాదు ఒక సీనియర్ జర్నలిస్టు హోదాలో ఉన్న టీవీ ఫైవ్ మూర్తి ఇలా చిరంజీవి గురించి మాట్లాడడం అస్సలు బాలేదని ఒకసారి ఆయన స్థాయి తెలుసుకొని మాట్లాడాలని, మీ గొడవల్లోకి ఆయన్ని లాగడమే తప్పు అనుకుంటే మళ్ళీ ఆయన గురించి ఈ విధంగా మాట్లాడతారా అంటూ మండి పడుతున్నారు.మీ వ్యక్తిగత విషయాల్లోకి సెలబ్రిటీని లాగడం చాలా పెద్ద తప్పు. ఈ విషయంలో చిరంజీవి లీగల్గా వెళ్లి ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.ఏది ఏమైనప్పటికీ టీవీ ఫైవ్ మూర్తి తలపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించకుండా ఇలా చిరంజీవిని మధ్య లోకి లాగడం ఏమాత్రం బాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: