2013లో విడుదలైన ‘మిర్చి’ ప్రభాస్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమా ప్రభాస్ ఇమేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. అందుకే ఇప్పుడు దానికి సీక్వెల్ తీసే ఆలోచన రావడం సహజమే. అయితే ఈసారి కథ మరింత పవర్‌ఫుల్‌గా, ఎమోషన్‌తో, హై ఆక్షన్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందట.ఇక ఈ వార్త బయటకు వచ్చిన దగ్గరనుంచే సోషల్ మీడియా మొత్తంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. “మిర్చి 2 వస్తుందా?”, “కొరటాల-ప్రభాస్ కాంబో మళ్లీ స్క్రీన్‌పై దుమ్ము రేపనుందా?” అంటూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అందులో హైలైట్ ఏమిటంటే — కొరటాల శివ స్వయంగా ప్రభాస్‌ని మీట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారట. కథ లైన్ వినగానే ప్రభాస్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడట. “ఇది కొత్త ఎమోషన్‌తో, కొత్త యాంగిల్‌లో ఉంటే కచ్చితంగా మనం చేస్తాం” అంటూ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గాలిలో తేలుతోంది. ఇప్పుడు అంతా ఒకే ప్రశ్న అడుగుతున్నారు — “మిర్చి 2 వర్కౌట్ అయితే, ఇండస్ట్రీ రికార్డులు సెట్ అయ్యేలా కాకుండా స్మాష్ అయిపోతాయ్!” ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్‌లో ఉన్నాడు, కొరటాల శివకీ ఆలోచన, విజన్ ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ కాంబినేషన్ తిరిగి స్క్రీన్‌పై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద కేకలు పడ్డేలా ఉంటుంది.
ఒకవేళ అన్ని సెట్ అయ్యి ప్రభాస్ తన కాల్ షీట్స్ ఇచ్చేస్తే మాత్రం మిర్చి 2 నిజంగా పట్టాలెక్కేస్తుంది. దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ టాలీవుడ్‌లో సునామీలా దూసుకువస్తుంది. అభిమానులు, సినిమా లవర్స్, ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి.సింపుల్‌గా చెప్పాలంటే — కొరటాల శివ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయితే, టాలీవుడ్ బాక్సాఫీస్ తగలబడిపోవడం ఖాయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి