తమిళ స్టార్ హీరో ,టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి , డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం జననాయగన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్ మమిత బైజు కూడా ఇందులో విజయ్ కూతురుగా కనిపించబోతున్నట్లు వినిపిస్తోంది. హీరో విజయ్ దళపతి చివరి సినిమా ఇదే అంటూ కూడా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు.


ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. దళపతి కచేరి అని రిలీజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు విజయ్ అభిమానులను మరింత ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పాటకు అనిరుద్ తో కలిసి విజయ్ పాడడం కూడా గమనార్హం. ఈ పాటకు ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల విజయ్ అభిమానులు కొంత మేరకు నిరాశపడ్డారు.


ఇప్పుడు తాజాగా ఈ సాంగ్ తో మరింత బూస్ట్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసి జననాయగన్ సినిమాలోని పాటే వినిపిస్తోంది. అయితే ఈ సినిమా బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీల పాత్రలో  మమిత బైజు నటిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమాకి భారీగానే డిమాండ్ ఉన్నట్లుగా సమాచారం. అలాగే సంక్రాంతికి ఎన్నో పాన్ ఇండియా చిత్రాలు కూడా తెలుగులో నుంచి విడుదలవుతున్నాయి. మరి ఏ సినిమాకి బాగా కలిసి వస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: