ఈ సినిమా పూర్తిస్థాయి పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతోంది. కథలోని ప్రతి భాగం రియలిస్టిక్ టచ్‌తో ఉండేలా దర్శకుడు ప్రతీ సన్నివేశాన్ని అద్భుతమైన స్థాయిలో డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ కోసం భారీ స్థాయిలో ఒక గ్రాండ్ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్‌పై రెండు వారాలపాటు నాన్‌స్టాప్‌గా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో ఈ ఫైట్స్‌ను తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్ తన పాత్రకు తగిన విధంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి, ఈ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన ఎనర్జీని చూపించబోతున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమా మొత్తానికే టర్నింగ్ పాయింట్ అవుతుందని, అలాగే విజువల్ మరియు ఎమోషనల్ లెవెల్‌లో భారీ హైలైట్‌గా నిలిచిపోతుందని ఇండస్ట్రీ టాక్. ఇదే సీక్వెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా రూపొందిస్తున్నారని సమాచారం.ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందట. ఆమె ఎంట్రీ సినిమాకి మరింత కలర్ అద్దబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మ్యూజిక్ విషయంలోనూ ఈసారి సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్తో కలిసి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలకు కొత్త డైమెన్షన్ ఇచ్చేలా ఉంటుందని అనుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి