ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే మాట—ఇదే కాంబినేషన్ ఎలా సాధ్యం అయ్యింది? మహేష్ బాబు – రాజమౌళి కాంబోతో వస్తున్న భారీ ప్రాజెక్ట్‌కి ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇవ్వడం ఎవరూ ఊహించలేదు. రాజమౌళి వంటి దర్శకుడు, మహేష్ బాబు వంటి స్టార్ హీరో ఉన్న ప్రాజెక్ట్‌లో ప్రియాంక కనిపిస్తుందని మాత్రం ప్రేక్షకులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌తో పాటు జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఆమె అటెండెన్స్ మాత్రం ప్రాజెక్ట్ మీద మరింత హైప్‌ని తీసుకొచ్చింది.సాధారణంగా బాలీవుడ్–హాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రెడ్ కార్పెట్‌లలో గ్లామర్‌ షో చేస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది.
 

కానీ ప్రియాంక చోప్రా మాత్రం ఈ ఈవెంట్‌కు పూర్తి పారంపారిక లుక్‌లో, అందమైన లెహంగాతో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. కుందనపు బొమ్మలా మెరిసిపోయిన ఆమె లుక్‌ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ లుక్ కారణంగానే ఆమె పేరు సోషల్ మీడియాలో మరింత వేగంగా ట్రెండ్ అవుతోంది.అయితే అసలు ప్రశ్న ఏమిటంటే—ప్రియాంక చోప్రా ఈ పెద్ద ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చింది? ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ నిర్ణయానికి కారణం నమ్రత  అని తెలుస్తోంది. ఆమె సూచనతోనే ప్రియాంకను ఈ ప్రాజెక్ట్‌కు తీసుకోవాలని ఫిక్స్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజమౌళి గతంలోనే ప్రియాంకను డైరెక్ట్ చేయాల్సిన అవకాశం దాదాపు వచ్చింది. ‘మగధీర’ సినిమా కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకునే ప్లాన్ చేశారట. కానీ రామ్ చరణ్ పక్కన టాలీవుడ్ నటిని తీసుకుంటే మరింత బాగుంటుందని భావించి కాజల్ అగ్రవాల్‌ను ఫైనల్ చేశారు. అలా అప్పట్లో మిస్ అయిన ఆ కాంబినేషన్ ఇప్పుడు మహేష్–జక్కన్న ప్రాజెక్ట్‌తో నిజం అవుతోంది. ఇలా ప్రియాంక ఎంట్రీ కారణంగా ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే టైటిల్ క్లిప్స్‌తో క్రేజ్ సృష్టించిన ఈ మూవీ, ప్రియాంక చోప్రా అటెండెన్స్‌తో పాన్ వరల్డ్ లెవల్ అటెన్షన్‌ను దక్కించుకుంది. ఇక సినిమా నుంచి రానున్న అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: