తెలుగు సినీ పరిశ్రమ లో తన కంటూ నటుడి గా తనకంటూ మంచి సంపాదించుకున్న వారిలో అల్లరి నరేష్ ఒక రు . ఈయన కెరియర్ను ప్రారంభించిన తర్వాత చాలా కాలం పాటు అద్భుతమైన విజయాలను అందుకుంటూ వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం నరేష్ ఎక్కువ శాతం విజయాలను అందుకోవడం లేదు. చాలా కాలం క్రితం విడుదల అయిన నాంది మూవీ తో ఈయనకు ఆఖరుగా విజయం వచ్చింది. ఈ మూవీ తర్వాత ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాల్లో నరేష్ నటించాడు. అలాగే తనకు కలిసి వచ్చిన కామెడీ చిత్రాల్లో కూడా నటించాడు. కానీ ఏ మూవీ ద్వారా కూడా ఈయనకు మంచి విజయం దక్కలేదు. తాజాగా నరేష్ "12A రైల్వే కాలనీ" అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ ఈ రోజు అనగా నవంబర్ 21 వ తేదీన విడుదల కానుంది. వరుస అపజయాలతో ఉన్న నరేష్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీ కి పెద్దగా బిజినెస్ జరగదు అని కొంత మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఓ టి టి డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓ టి టి సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: