తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వివేక్ ఆత్రేయ ఒకరు. ఈయన ఇప్పటి వరకు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన వాటిలో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన ఆఖరుగా దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లో కూడా నాని హీరోగా నటించాడు. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో మొదటగా అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. ఈ మూవీలో నజ్రియా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకో గలిగింది. ఇక కొంత కాలం క్రితం వీరిద్దరి కాంబోలో సరిపోతా శనివారం అనే సినిమా వచ్చింది.

మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఆ వివేక్ ఆత్రేయ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడలేదు. తాజాగా వివేక్ ఆత్రేయ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... వివేక్ ఆత్రేయ తన తదుపరి మూవీ ని తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య తో చేయబోతున్నట్లు, అందులో భాగంగా ఈ మధ్య కాలం లోనే వివేక్ ఆత్రేయ , సూర్య ను కలిసి ఓ కథను వినిపించినట్లు , ఆ కథ బాగా నచ్చడంతో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేయడానికి సూర్య కూడా గ్రేప్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: