ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ట్రెండ్స్ ఎంత వేగంగా మారుతున్నాయో అందరికీ తెలుసు. ఎలాంటి సినిమా రిలీజ్ అయినా హీరో పేరు, హీరోయిన్ పేరు, డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ పేర్లు ట్రెండింగ్‌లోకి రావడం కామన్ విషయం. రిలీజ్ అయిన ప్రతి పెద్ద సినిమా సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఈ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేస్తున్న వ్యక్తి ఒకరే… ఆయన సంగీత దర్శకుడు థమన్. ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా, థమన్ సంగీతం ఉన్న ప్రాజెక్ట్ అయితే హీరో–హీరోయిన్ల కంటే కూడా ఎక్కువగా హైలైట్ అయ్యేది ఆయనే. ఆయ‌న మ్యూజిక్ అంటే అభిమానుల్లో ఉత్సాహం వేరే లెవల్‌లో ఉంటుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నటించిన "ఓజి"  సినిమాకి ఆయన ఇచ్చిన సంగీతం కారణంగా సోషల్ మీడియాలో ముందుగానే హైప్ రెట్టింపైంది. సుజీత్ డైరెక్షన్, పవన్ కళ్యాణ్ స్టైల్ ఒక పక్క ఉంటే… థమన్ మ్యూజిక్ ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి మరో ప్రధాన కారణం అని అందరూ చెప్పుకుంటున్నారు.


ఇప్పుడు ఇదే సీనారియో బాలయ్య అఖండ 2 విషయంలో కూడా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన అఖండ 2 ట్రైలర్ గురించి మాట్లాడితే—ప్రతి ఒక్కరూ బాలయ్య గారి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కి, బోయపాటి శ్రీను మాస్ డైరెక్షన్‌కి ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రైలర్ విజువల్స్, బాలయ్య ఎనర్జీ గురించి అభిమానులు సందడి చేస్తున్నారు. కానీ వీరిద్దరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న పేరు మాత్రం ఒక్కటే… థమన్.“ఏం మ్యూజిక్ ఇచ్చాడు!”, “ఏ బీట్స్ అందించాడు!”, “బాలయ్య సినిమాలంటే థమన్ వేరే రేంజ్‌లో మ్యూజిక్ ఇస్తాడు!” అంటూ సోషల్ మీడియా మొత్తం పొగడ్తలతో నిండిపోయింది. ట్రైలర్‌లోనే ఇంత బలమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అంటే, థియేటర్లలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్‌కి థమన్ సంగీతం జత అయితే ఏ రేంజ్ మాస్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుందో ఇప్పుడే ఊహించగలిగే స్థాయిలో కామెంట్స్ వస్తున్నాయి.



సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అయ్యేది హీరో పేరు కాదు, హీరోయిన్ పేరు కాదు… థమన్ పేరు మారుమ్రోగిపోయేలా ట్రెండింగ్ అవుతోంది. అఖండ 2 ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఆయన పేరు సోషల్ ప్లాట్‌ఫామ్స్ మొత్తం షేక్ చేస్తోంది. ఇలా చూస్తే, థమన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాకి హైప్ రాబట్టే ప్రధాన ఫ్యాక్టర్లలో ఒకరిగా మారిపోయాడని చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: