నందమూరి బాలకృష్ణ గెట్‌ప్, బోయపాటి శ్రీను మాస్ డైరెక్షన్, థమన్ అందించిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్—ఈ మూడు కలిసి అఖండ 2 కి అద్భుతమైన హైప్‌ను తెచ్చిపెట్టాయి. ట్రైలర్ చూసిన వెంటనే ప్రేక్షకులు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్‌తో నింపేసారు. "ఇదే బోయపాటి–బాలయ్య కాంబినేషన్ మేజిక్" అంటూ ఫుల్ జోష్‌లో రియాక్షన్లు ఇస్తున్నారు. అయితే ఈ మొత్తం సంబరంలో ఒక్క అంశం మాత్రం చాలా మందికి బలమైన నెగిటివ్ పాయింట్‌గా కనిపిస్తోంది. అదే – సంయుక్తా  పాత్ర, ఆమె లుక్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్‌లో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.


ట్రైలర్ చూసిన చాలా మంది ప్రేక్షకులు,"బాలయ్య పక్కన సంయుక్తా ఒక్క శాతం కూడా సూట్ కాలేదు" అని, "స్క్రీన్ మీద ప్రెజెన్స్ బలహీనంగా ఉంది" అని, "డాన్స్ సీన్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ చాలా పూర్‌గా ఉంది" అని..అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించిన ఆమె ఎంట్రీ కూడా ప్రభావం చూపలేదని పెద్ద ఎత్తున అభిప్రాయపడుతున్నారు. అందుకు తోడు, బోయపాటి శ్రీను సాధారణంగా తన సినిమాల్లో నటీనటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడన్న విషయం ఇండస్ట్రీకి, ఫ్యాన్స్‌కి బాగా తెలిసిందే. అలాంటి దర్శకుడు ఈసారి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "బోయపాటి గారికి ఇంతవరకు ఉన్న క్యాస్టింగ్ సెన్స్ ఇలా ఎలా తగ్గింది?", "ఏం చూసి ఆమెను ఎంపిక చేశారు?" అంటూ విమర్శల్లో ఘాటు పెరుగుతోంది.



సోషల్ మీడియాలో కొంతమంది అయితే మరింత గా వెళ్లి, "అఖండ 2కి నెగిటివ్ టాక్ రావాలంటే అది సంయుక్తా పాత్ర వల్లే వస్తుంది, కానీ మిగతా అంశాల్లో ఒక్క మచ్చ కూడా ఉండదు" అని స్పష్టంగా పేర్కొంటున్నారు. ట్రైలర్ విడుదలైన ఒకరోజు లోపే బోయపాటి శ్రీను పేరు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాలయ్య పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ముందు సంయుక్తా మీనన్ 0.001% కూడా మ్యాచ్ కాలేదని, ఇది సినిమా యొక్క ఏకైక బలహీనతగా మారే అవకాశముందని అంటున్నారు. మొత్తం మీద, అఖండ 2 ట్రైలర్ మాస్‌గా, గ్రాండ్గా ఆకట్టుకున్నప్పటికీ, సంయుక్తా పాత్రపై వస్తున్న విమర్శలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. సినిమా రిలీజ్ వరకు ఈ డిస్కషన్ ఆగేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: