ఏంటి బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారా.. నిజంగానే అలియా భట్ రణబీర్ కపూర్ ల మధ్య దూరం పెరిగిందా.. విడాకులు తీసుకోబోతున్నారనే మాట నిజమేనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంటల్లో అలియా భట్,రణబీర్ కపూర్ లు కూడా ఒకరు.. పెళ్లికి ముందు వీరు ఇద్దరు కొంతమందితో రిలేషన్ లో ఉన్నప్పటికీ ఫైనల్ గా ఈ జంట ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.వీరికి రాహా అనే పాప కూడా పుట్టింది.అలియా భట్ పాప పుట్టాక మళ్ళీ సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా అలియా భట్ రణబీర్ కపూర్ విడాకులు తీసుకోబోతున్నారని, వీరిద్దరి  మధ్య దూరం పెరిగింది అనే వార్త బాలీవుడ్ ని షేక్ చేస్తోంది.మరి ఈ రూమర్లు రావడానికి కారణం ఏంటి.. నిజంగానే ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా బాలీవుడ్ దిగ్గజ ఫ్యామిలీలలో కపూర్ ఫ్యామిలీ కూడా ఒకరు.

అయితే వీళ్ళు తాజాగా డైనింగ్ విత్ ది  కపూర్స్  అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.అయితే ఈ కార్యక్రమంలో రణబీర్ కపూర్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కానీ ఈ కార్యక్రమానికి ఆలియా భట్ రాకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి దూర దూరంగా ఉంటున్నారనే పుకారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో రణబీర్ కపూర్,కరీనా కపూర్, రణధీర్ కపూర్, రన్బీర్ తల్లీ నీతు కపూర్,కరీనాకపూర్ భర్త సైఫ్ అలీఖాన్,కరిష్మా కపూర్ తోపాటు ఇంకొంతమంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి కపూర్ కుటుంబ సభ్యుడైనటువంటి అర్మాన్ జైన్ హోస్టుగా చేస్తున్నారు.ఇక ఈ డైనింగ్ విత్ ది కపూర్స్ అనే షో కి సంబంధించిన ప్రోమోలో వీరంతా సందడి చేస్తూ కనిపించారు. ఈ కార్యక్రమం నవంబర్ 21న నేట్ ఫ్లిక్స్ లో ప్రసారమయింది. ఇక ఇందులో రణబీర్ కపూర్ ఫ్యామిలీ మొత్తం వంటలు చేసుకుంటూ హాయిగా అందరు కూర్చొని సరదాగా తింటూ కలిసి మాట్లాడుకోవడం ఇందులో చూపించారు. 
కానీ వీరిలో ఆలియా భట్ మిస్ అవ్వడంతో చాలామంది ఇదేంటి కపూర్ ఫ్యామిలీలో అలియాభట్ మిస్సయింది. ఆమె రణబీర్ కపూర్ తో ఉండడం లేదా.. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయా..విడాకులు తీసుకోబోతున్నారా అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.కానీ తాజాగా ఈ అనుమానాలు అన్నింటికి తెరదించుతూ ఈ షో కి హోస్టుగా చేసిన అర్మాన్ జైన్ అలియా భట్ రాకపోవడానికి కారణం చెప్పారు. అలియా భట్ ఈ షోకి రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏమీ లేవు. కేవలం ఆమె సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే ఈ షో కి రాలేకపోయింది. దీనికి వేరే విధంగా అనుమాన పడవలసిన అవసరం లేదు. ఇక హోస్ట్ ఇచ్చిన క్లారిటీతో రణబీర్ కపూర్ అలియా భట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక డైనింగ్ విత్ ది కపూర్స్   షోలో కపూర్ ఫ్యామిలీ తమ వ్యక్తిగత విషయాలను గత సంఘటనలను పంచుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: