ఇంతటితో ఆగకుండా కొంతమంది ఆయన గతంలో చేసిన పాత స్టేట్‌మెంట్స్ కూడా తీసుకొచ్చి వాటిని కట్ చేసి, ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో వివాదం మరింత పెరుగుతూ ఉంది. కానీ ఈ మొత్తం పరిస్థితుల్లో రాజమౌళి వైపు నుంచి మాత్రం ఇప్పటి వరకు ఒక్క స్పందన కూడా రాలేదు. ఆయన నిశ్శబ్దంగా ఉన్న తీరు మరింత చర్చనీయాంశంగా మారింది. చాలామంది అభిమానులు, సినీ ప్రేమికులు “రాజమౌళి ఒక చిన్న క్షమాపణ చెప్తే విషయం ఇక్కడే ముగిసిపోతుంది” అని అంటుంటే, మరికొందరు ఆయన నిశ్శబ్దాన్ని ఓ ధైర్యం, తన కంటెంట్‌పై నమ్మకంగా చూస్తున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం “ఇది మొండితనం, ఓవర్ కాంఫిడెన్స్, అవసరం లేని పట్టుదల” అంటూ తప్పుబడుతున్నారు. ఇలా పరిస్థితి అనవసరంగా గొట్టితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకెళ్లినట్లైంది అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వివాదం ఎలా ముగుస్తుందో, రాజమౌళి చివరకు స్పందిస్తారా లేదా — అన్నది అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఆయన మాట ఒకటి ఈ మొత్తం నెగిటివిటీకి చెక్ పెట్టే అవకాశం ఉందని అనేక మంది భావిస్తున్నారు. కానీ ఆయన తన స్టేట్మెంట్ ఇస్తారా, లేక మౌనమే కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సింది ఆయనే. అందరూ వేచి చూస్తున్నది అదే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి