12వ వారం దివ్య ఎలిమినేషన్ అవ్వడంతో ఈమె భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా వినిపిస్తోంది. ఈమె వారానికి గాన రూ.1.5 రూపాయలు చొప్పున పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. అంటే మొత్తం మీద 9 వారాలకు గాను సుమారుగా రూ .15 లక్షల రూపాయల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సినిమా రివ్యూస్ లను చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించిన దివ్య ఆ తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి సెలెక్ట్ అయ్యింది.
కానీ హౌస్ లోకి మాత్రం వైల్డ్ కార్డు ద్వారా కామనర్ గానే ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు వారాలలోనే తన ఆట మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది దివ్య. హౌస్ లో భరణితో స్నేహబంధంతో మొదట్లో బాగానే ఉన్న అది చివరికి ప్రేక్షకులను చిరాకు తెప్పించేలా చేసింది. ముఖ్యంగా తనుజాతో, భరణి మాట్లాడితే గొడవ పెట్టుకునే అంశాలు, ప్రతి చిన్న విషయానికి కూడా ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఆడియన్స్ కి విసుగు తెప్పించేలా చేసింది దివ్య. ఇటివలె భరణి, దివ్య, తనూజ మధ్య గొడవల వల్లే దివ్య ఎలిమినేట్ అయ్యిందంటూ కారణాలు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి