- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

బోయపాటి శ్రీను సినిమాల్లో ప్రతినాయకులు కూడా హీరోలకి ఏమాత్రం తగ్గకుండా శక్తివంతంగా, ప్రభావవంతంగా నిలబడటం ప్రత్యేకత. కథలో విలన్ బలంగా లేకుంటే హీరో పవర్ కనిపించదని బోయ‌పాటి భావిస్తారు. అందుకే ఆయన రూపొందించిన సినిమాలో ప్రతినాయకులకు భారీ డైలాగులు, రౌద్ర స్వ‌రూపం, భ‌య‌పెట్టే స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి పూర్తిగా జనంలో గుర్తుండిపోయేలా చూపిస్తారు. జగపతి బాబు లెజెండ్ , శ్రీకాంత్ అఖండ , ప్రదీప్ రావత్ సింహా పాత్రలు ఇందుకు ఉదాహరణలు. ఆ సినిమాల తర్వాత వాళ్ల కెరీర్ గ్రాఫ్ కూడా గణనీయంగా మారింది. ఇప్పుడు అఖండ 2 లో బాలకృష్ణకు ఎదురుగా ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా రావడం సినిమాపై అంచ‌నాలు మరింత పెంచింది. టీజర్లు, పోస్టర్లలో ఆది కొద్దిసేపే కనిపించినా .. ఆ వేషం , శరీర భాష , కళ్లలో కనిపించిన క్రూరత ప్రేక్షకుల్లో బలమైన ఇంపాక్ట్ సృష్టించింది. బాలయ్య వంటి ఎనర్జిటిక్ స్టార్‌కు ఎదురుగా నిలబడటం చిన్న విషయం కాదు. ఆ పవర్‌ను తట్టుకునే విలన్ కావాలంటే లుక్ , అట్టిట్యూడ్, డైలాగ్ డెలివరీ , ఆగ్రహం అన్నీ రఫ్‌గా కనిపించాలి. ఆది ఆ రేంజ్‌కి పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయినట్టు ప్రీ-లుక్‌లే సూచిస్తున్నాయి.


ఇటీవలి కాలంలో వరుస పరాజయాల కారణంగా ఆది కెరీర్ కొంత డౌన్‌ఫేజ్‌లో పడింది. రంగస్థలంలో చేసిన రామలింగం పాత్రను అభిమానులు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు కానీ ఆ తర్వాత ఆయన నటన సామర్థ్యానికి సరిపోయే పెద్ద బ్రేక్ రాలేదు. లీడ్‌గా చేసిన చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అలాంటప్పుడు బోయపాటి సినిమాలో శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపించే అవకాశం రావడం ఆది లక్ మార్చే టర్నింగ్ పాయింట్ కావచ్చు.


అఖండ 2 లో బాలకృష్ణ - ఆది మధ్య జరిగే పోరాట ఘట్టాలు, డైలాగ్ వార్స్, భావోద్వేగ సన్నివేశాలు సినిమా హైలైట్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి. బోయపాటి శైలిలో విలన్‌ను బలంగా చూపిస్తారని తెలుసు కాబట్టి, ఈ చిత్రమే ఆదికి కెరీర్‌లో అత్యంత గుర్తింపు తీసుకురాగల అవకాశముంది. బాలయ్య ఎనర్జీకి సరిసమానంగా నిలబడి ప్రేక్షకుల్లో భయం, ద్వేషం, ఆసక్తి రేపగలిగితే ఈ పాత్ర ఎఫెక్ట్‌తో ఆది మరోసారి టాప్ నటుల్లో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవ‌డం ఖాయం. ఈ సినిమా ఆది కెరీర్‌ను ట‌ర్న్ చేయ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: