పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ కామెడీతో రాబోతోంది. ఇందులో మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభాస్ ను చూపించిన తీరు సరికొత్తగా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో తాజాగా రాజా సాబ్ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా ఎక్కువ రన్ టైమ్ తోనే కనిపిస్తున్నాయి. ది రాజా సాబ్ సినిమా విషయంలో కూడా భారీ రన్ టైం తో విడుదల కాబోతున్నట్లు  తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్లు సమాచారం. అక్కడ బుకింగ్ వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం ది రాజా సాబ్ చిత్రం  సుమారుగా 3 గంటల 14 నిమిషాలు ఉన్నట్లుగా వినిపిస్తోంది.


మొత్తానికి ప్రభాస్ గత సినిమాల లాగే రాజా సాబ్ సినిమా కూడా భారీగానే రన్ టైం తో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. మొదటిసారి హీరో ప్రభాస్ ఇలాంటి హార్రర్ కామెడీ జోనర్లో నటిస్తున్నారు. మరి ఏ మేరకు అభిమానులను మెప్పిస్తారో చూడాలి మరి. రాజా సాబ్ సినిమాతో ఇలాంటి రికార్డులను తిరగ రాస్తారో చూడాలి ప్రభాస్. అలాగే కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ వంటి చిత్రాలలో కూడా నటించబోతున్నారు ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: