ఇక ఇదే సమయంలో, కొన్ని ఏఐ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏఐ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో చూపిస్తున్నట్లుగా, రామ్ చరణ్ సమంత–రాజ్ పెళ్లికి హాజరైనట్లు తయారు చేసిన ఏఐ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సమంతతో కలిసి రామ్ చరణ్ ఫోటోలకు పోజులు ఇచ్చినట్లు, పెళ్లి మండపంలో నిలబడి ఉన్నట్లు, అలాగే పెళ్లి రీత్యా క్లిక్స్ తీసినట్లుగా కనిపించే ఏఐ ఇమేజెస్ చూసి చాలామంది నిజంగానే అవునా? రామ్ చరణ్ సమంత పెళ్లికి వచ్చాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, రామ్ చరణ్ పెళ్లి స్పాట్‌లో ఉన్నట్లుగా చూపించే ఒక ఏఐ వీడియో కూడా బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో చరణ్ అన్ని కార్యాల్లో పాల్గొన్నట్టుగా చూపించడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. కానీ తరువాత అది పూర్తిగా ఏఐ సృష్టించిన వీడియో మాయాజాలమని స్పష్టమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం సమంత పెళ్లికి చరణ్ పెద్ద దిక్కు అనే ట్యాగ్‌తో షేర్ అవుతున్న ఏఐ ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏఐ టెక్నాలజీ ఎంత రియలిస్టిక్ విజువల్స్ క్రియేట్ చేయగలదో ఇవి మరోసారి రుజువు చేస్తున్నాయి. మొత్తం మీద, సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి వేడుక, అందులో షేర్ అయిన అసలు ఫోటోలు, గెస్ట్ ల ఫోటోలు… వాటికి తోడు వైరల్ అవుతున్న ఏ ఐ కంటెంట్—ఇవి అన్నీ కలిసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఘనంగా ట్రెండ్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి