ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ అఖండ 2 చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. అఖండ 2 చిత్రాన్ని నిర్మించింది 14 రీల్స్ సంస్థ.. ఈ సంస్థ నుంచి తమకు రూ .28 కోట్ల రూపాయలు నష్టాలను చెల్లించాల్సి ఉన్నదని, కానీ ఇప్పుడు వీరు 14 రీల్స్ ప్లస్ అనే పేరుతో సినిమాలు చేస్తున్నారు. ఆ డబ్బులు చెల్లించేంతవరకు అఖండ 2 సినిమా విడుదల ఆపాలి అంటూ మద్రాస్ హైకోర్టుకు వెళ్లడంతో.. మద్రాస్ హైకోర్టు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అనుకూలంగానే తీర్పించింది. అఖండ 2 సినిమా ఆపివేయాలని హైకోర్టు కూడా ఉత్తర్వులను జారీ చేసింది.
ఈరోస్ సంస్థ చెప్పే ఆ రూ .28 కోట్ల నష్టం కూడా మహేష్ బాబు నటించిన నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాలకు సంబంధించినవి అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలను కూడా 14 రీల్స్ సంస్థ నిర్మించింది. మరి అఖండ 2 సినిమా కేవలం తమిళనాడులో మాత్రమే విడుదల కాకుండా ఆపాలా లేకపోతే దేశమంత విడుదల ఆపాలా అనే విషయంపై ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం రేపటి రోజున సినిమా విడుదలనగా బాలయ్య అభిమానులకు విడుదల ముందే ఒక పెద్ద షాక్ తగిలింది. మరి ఈ విషయం పైన 14 రీల్స్ సంస్థ ఏవిధంగా స్పందిస్తుందొ చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి