ఈ జోడికి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు. షో నుంచి బయటికి వచ్చిన తర్వాత వీరిద్దరూ మల్లి పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత పునర్నవి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిందనే విధంగా వినిపించాయి. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల హరిణ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పునర్నవి కూడా తన ప్రియుడిని పరిచయం చేస్తూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా ఒక హింట్ అయితే అభిమానులకు ఇచ్చేసింది.
అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసిన పునర్నవి కాశ్మీర్లో తన ప్రియుడు ప్రపోజ్ చేయడంతో ఆమె ఓకే చెప్పినట్లుగా ఒక ఫోటోని షేర్ చేసింది. పునర్నవి ప్రియుడు పేరు హేమంత్ శర్మ. ఇతను ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. పునర్నవి ఇటీవల కాలంలో సినిమాలలో పెద్దగా కనిపించకపోయిన సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. మరి వివాహానికి సంబంధించి పూర్తి విషయాలను త్వరలోనే తెలియజేస్తుందేమో చూడాలి మరి. చివరిగా పునర్నవి 2020 లో నటించిన చిత్రం సైకిల్,కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది..మళ్లీ ఆ తర్వాత కనిపించలేదు.మరి వివాహం అనంతరం రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి