సమంత రాజ్ నిడిమోరు ఈమధ్యనే పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 1న ఈ జంట అధికారికంగా పెళ్లి చేసుకొని తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరితో పంచుకున్నారు. ఇక వీరి పెళ్లి జరిగాక పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే సమంత రాజ్పెళ్లి గురించి ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా రాజ్ సమంతకి పెళ్లి రోజు పెద్ద విల్లా ని గిఫ్టుగా ఇచ్చారని, హనీమూన్ కి అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు అంటూ పెద్ద పెద్ద దేశాల పేర్లు హనీమూన్ ప్లేసెస్ గురించి రాసేశారు.కానీ ఫైనల్గా సమంత హనీమూన్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. 

దానికి కారణం తాజాగా సమంత పెట్టిన ఓ పోస్టే.. మరి ఇంతకీ సమంత పెట్టిన ఆ పోస్టులో ఏముంది అంటే.. సమంత పెళ్లైన నాలుగు రోజులకే తన సినిమా షూటింగ్లో జాయిన్ అయిపోయింది. తాజాగా సమంత నందిని రెడ్డి డైరెక్షన్ చేస్తున్న మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ సెట్లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలామంది నెటిజెన్లు ఇదేంటి సమంత పెళ్ళైన నాలుగు రోజులకే వర్క్ మోడ్ లోకి వచ్చేసిందా.. అంటూ చాలామంది షాక్ అవుతున్నారు.ఇక మరికొంత మందేమో సమంత హనీమూన్ ల గురించి ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సమంత మళ్ళీ సినిమా షూటింగ్ సెట్లో జాయిన్ అయిపోయింది అంటే వీరి హనీమూన్ క్యాన్సిల్ అయినట్టుంది అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ఇంకొంతమంది వీరికి హనీమూన్ ఎందుకు.. ఇప్పటికే డేటింగ్ చేశారు.మళ్లీ కొత్తగా హనీమూన్ ఎందుకులే అనుకున్నారు కావచ్చు అంటూ వైరల్ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి సమంతకు వర్క్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో ఈ ఒక్క ఫోటో చూస్తే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఆమె అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: