టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన మీనాక్షి చౌదరి ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలతో కూడా బ్లాస్ట్ అయ్యేలా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్దిరోజుల నుంచి హీరో సుశాంత్ తో ప్రేమలో ఉందని త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే విధంగా సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.ఇటీవలే ఎయిర్ పోర్టులో కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ మరింత బలమయ్యాయి.


ఈ విషయం పైన మీనాక్షి చౌదరి టీమ్ స్పందించింది. కేవలం వారిద్దరు స్నేహితులు మాత్రమే , వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి విషయాలనైనా సరే తామే అధికారికంగా ప్రకటిస్తామంటూ మీనాక్షి చౌదరి టీమ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్స్ కి చెక్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి 2021 లో వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరూ ఎక్కడ కనిపించినా కూడా పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.



ఈ విషయాలపై ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చిన మీనాక్షి చౌదరి తాజాగా మళ్లీ ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. మీనాక్షి చౌదరి సినిమాల విషయానికి వస్తే. ఖిలాడి , హిట్ 2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి తదితర చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అలా ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అనగనగా ఒక రాజు, విశ్వంభర, వృషకర్మ, చియాన్ 63, NC 24 తదితర చిత్రాలలో నటిస్తోంది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం మీనాక్షి చౌదరికి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: