టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన జానీ మాస్టర్ అంటే కేవలం సినిమాలే మాత్రమే కాదు, వివాదాలలో కూడా ఈ కొరియోగ్రాఫర్ పేరు ఎక్కువగా వినిపించింది. ఆ మధ్య ఒక లేడీ కొరియోగ్రాఫర్ (శ్రేష్ఠ వర్మ) జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించారని, శారీరకంగా దాడి చేశారని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారంటూ కేసు పెట్టింది. బాధితురాలు వేధింపుల సమయంలో మైనర్ కావడం చేత జానీ మాస్టర్ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో కొద్ది రోజులు జైల్లో కూడా ఉన్నారు.



అనంతం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటికి వచ్చారు. ఆ తరువాత సినిమా అవకాశాలు రావు అనుకున్న సమయంలో బడ హీరోల చిత్రాలు కొరియోగ్రాఫర్ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు. శ్రేష్ఠ వర్మ మాత్రం కొన్ని ఇంటర్వ్యూలలో సోషల్ మీడియాలో తనకు జరిగిన అన్యాయాన్ని సంబంధించి వీడియోలతో మళ్లీ వివాదాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఈమె ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. జానీ మాస్టర్ భార్య సుమలత, శ్రేష్ఠ వర్మ పైన పలు షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉండేది.


జానీ మాస్టర్ గతంలో కూడా జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవారు. అయితే ఈ లైంగిక ఆరోపణల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా తిరుచిత్రంబలం  చిత్రానికి గాను జాతీయ అవార్డు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది. గతంలో డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న జానీ మాస్టర్.. ఇప్పుడు ఆ పదవిని ఆయన భార్య (సుమలత) తెలుగు సినిమా, టీవీ డాన్సర్ అసోసియేషన్ (TFTDDA) గ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో ని కూడా షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: