టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలలో కొందరు హీరోలు సినిమాలపై మాత్రమే దృష్టి పెడితే మరి కొందరు హీరోలు మాత్రం తెలివిగా వేర్వేరు వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తూ మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రిచ్ హీరో ఎవరనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు. వేల కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉండటం అంటే సాధారణ విషయం కాదు. వ్యక్తిగత సంపదలో బాలీవుడ్ స్టార్స్ తో పోల్చినా కూడా టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున పైచేయి సాధించారు.
స్టార్ హీరో నాగార్జున నికర ఆస్తుల విలువ ఏకంగా 3572 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. వేర్వేరు వ్యాపారాలలో నాగ్ ఇన్వెస్ట్ చేయడంతో పాటు లాభాలను సొంతం వల్ల ఈ స్థాయికి ఎదిగారు. సినిమాల్లో కింగ్ అయిన నాగార్జున ఆస్తుల విషయంలో కూడా కింగ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్, సినిమా, స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ లలో పెట్టుబడులు పెట్టడం నాగ్ కు ప్లస్ అయిందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్, ఎన్3 రియాల్టీ enterpraises ద్వారా కూడా నాగార్జున భారీ స్థాయిలోనే సంపాదించినట్టు తెలుస్తోంది. నాగార్జున త్వరలో 100వ సినిమాకు సంబంధించిన ప్రకటన చేయడంతో పాటు ఆ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
మరో సీనియర్ స్టార్ హీరో చిరంజీవి నికర ఆస్తుల విలువ 1650 కోట్ల రూపాయలుగా ఉంది. చిరంజీవి తన సినిమాల ద్వారా ఈ మొత్తాన్ని సంపాదించారు. ప్రస్తుతం చిరంజీవి పారితోషికం 70 నుంచి 80 కోట్ల రూపాయలుగా ఉంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిరంజీవి పాన్ ఇండియా హిట్ సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
చిరంజీవికి సొంతంగా విమానంతో పాటు దేశంలోని పలు నగరాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని సమాచారం అందుతోంది. చిరంజీవి కార్ గ్యారేజ్ లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. కెరీర్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఆచితూచి అడుగులు వేయడం మెగాస్టార్ చిరంజీవికి కలిసొచ్చిందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి