కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లు తెలుగు సినిమాల్లో పెద్దగా నటించేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. దానితో బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న నటీ మణులు కూడా తెలుగు సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కూడా ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఓ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం ఓ తెలుగు సినిమాలో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఆపజయాన్ని అందుకుంది. ఆ మూవీ తర్వాత అ బ్యూటీ కి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో కూడా అవకాశం రాలేదు. ఇంతకు ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు అనన్య పాండే. ఈమె హిందీ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ఈమె లైగర్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. 

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు  భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా గనుక మంచి విజయం సాధించి ఉండి ఉంటే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ వచ్చేది అని , వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల మూవీలలో అవకాశాలు వచ్చేవి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనన్య పాండే హిందీ సినిమాల్లో మంచి అవకాశాలను దక్కించుకుంటూ మంచి స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: