అఖండ 2 సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి భారీ హైప్స్ ఏర్పడింది. కానీ విడుదల సమయానికి వరుస షాక్కుల తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉన్న బాలయ్య అఖండ 2 చిత్రం నిర్మాతల సమస్య వల్ల ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్ షో టికెట్ ధర రూ .600 రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్ణయించారు. ఇటువంటి తరుణంలోనే డిసెంబర్ 11 తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.


ఈ ఫిటీషన్ స్వీకరించిన అనంతరం హైకోర్టు టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణ పైన విచారణ జరుపనట్లుగా తెలిసింది.. అఖండ 2 చిత్రానికి సంబంధించి టికెట్ల రేటును హైక్స్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని సస్పెండ్ చేయాలని FDC సంస్థ, సినీ నిర్మాణ సంస్థకు హైకోర్టు నోటీసులను జారీ చేసింది. దీంతో ఈ విచారణ డిసెంబర్ 12 కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు తాజాగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి (డిసెంబర్ 11) నిన్న ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.


ఈరోజు మధ్యాహ్నం 1:15 గంటలకు ఈ విషయం పైన విచారణ జరగనుంది. నిన్న సినిమా టికెట్ల రేటు పెంపు పిటిషన్ విచారించిన కోర్టు టికెట్ ధరల పెంపునకు సంబంధించి జీవోను కూడా రద్దు చేసింది. ఇటువంటి తరుణంలోనే అఖండ 2 సినిమా విడుదల చేయడంతో ఇప్పుడు మరో పిటిషన్ దాఖలయ్యింది. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: