ఈ ఏడాది 2025 సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలలో గేమ్ ఛేంజర్ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్లో ఈ సినిమా విడుదలయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ మూటకట్టుకుంది. గేమ్ ఛేంజర్ సినిమా స్క్రీన్ ప్లే, రన్ టైమ్, విడుదల రోజు పైరసీ వంటి సమస్యల వల్ల ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని అభిమానులు తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేయాల్సి ఉంది అంటు చాలామంది అభిప్రాయాన్ని తెలియజేశారు.

సినిమా నిడివి:
ఇక సినిమా విడుదలైన నాలుగు నెలల తర్వాత ఒక ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమా ఎడిటర్ షమీర్ మహమ్మద్ మాట్లాడుతూ ఈ చిత్రం 7:30 గంటలకు పైగా ఉండగా ఈ చిత్రాన్ని 3 గంటలకు తీసుకువచ్చానని ఆ విషయంలో శంకర్ గారితో పడక వెళ్లిపోయానని , ఆ తర్వాత మరో ఎడిటర్ ఈ సినిమాని  మరింత కట్ చేశారని తెలిపారు. కానీ డైరెక్టర్ శంకర్ కూడా ఈ సినిమా 5 గంటల రన్ టైం ఉన్నప్పటికీ చాలా మంచి సీన్స్ కట్ చేశామని తెలిపారు. సుమారుగా రూ .400 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది.

కోట్ల రూపాయల నష్టం:
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 131 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టి పెద్ద మొత్తంలో నష్టాన్ని మిగిల్చింది. ఈ ఏడాది  టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన సినిమా లిస్టులో చేరినట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని పాటలు, రామ్ చరణ్ ద్విపాత్రాభినయం కు ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని పాటలకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ చిత్రం ద్వారా దిల్ రాజు ఏకంగా రూ .200 కోట్లు నష్టపోయారని సమాచారం. రెమ్యూనరేషన్ విషయంలో రామ్ చరణ్ కొంతమేరకు వెనక్కి ఇచ్చినట్లుగా వినిపించాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: